అందరికీ కలిపి ఆ స్టార్ హీరో కౌంటర్ వేసాడా!
కోలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి సక్సెస్ అవ్వడం అంత వీజీ కాదు.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన విధానం గురించి చెప్పాల్సిన పనిలేదు. తండ్రి, సోదరులు దర్శకులైనా అది ఆరంభం వరకే. ఆ తర్వాత అంతా ఆయన స్వయంకృపరాధమే. తనని తానే స్టార్ గా తీర్చిది ద్దుకున్నాడు. ధనుష్ సినిమా సినిమాలు..ఎంపిక చేసుకున్న కంటెట్ మాత్రమే అతడిని స్టార్ గా నిలబెట్టాయి. బాలీవుడ్ లో కూడా అదే తీరున సక్సెస్ అయ్యాడు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి సక్సెస్ అవ్వడం అంత వీజీ కాదు.
ఖాన్ లు..కపూర్ లనుంచి పోటీ తట్టుకుని అక్కడా నిలబడ్డాడు. ఇదంతా కేవలం తన నటన..ఎంపిక చేసుకున్న కథల తోనే సాధ్యమైందన్నది వాస్తవం. అలాంటి ధనుష్ పై సొంత పరిశ్రమ నుంచి విమర్శలు కూడా చాలానే ఉన్నా యి. నిర్మాతలకు సరిగ్గా డేట్లు ఇవ్వడని...ఇచ్చినా సవ్యంగా షూటింగ్ కు హాజరు కాడనే ఆరోపణలున్నాయి. ఆ మధ్య ధనుష్ ని బ్యాన్ అయినంత సీన్ సైతం క్రియేట్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయానా సొంత అల్లుడు ధనుష్ ఒకప్పుడు.
ఐశ్వర్యా రజనీకాంత్ కు విడాకులు ఇవ్వడంతో? మాజీ అల్లుడుగా మారాడు. ఇటీవలే లేడీ సూపర్ స్టార్ నయనతార సైతం ధనుష్ వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ధనుష్ పై కొంత నెగిటివిటీ ఉంది. ఈనేపథ్యంలో ఇంటర్వ్యూలో ధనుష్ ఆసక్తికర కామెంట్లు చేసాడు. తనని అర్దం చేసుకోవడం నిజంగానే కొంచెం కష్టమని..తనతో సన్నిహితంగా ఉండే వారికి మాత్రమే తానేంటో తెలుస్తుందన్నాడు.
కానీ తాను మాత్రం అంత సులభంగా ఎవరికీ దగ్గర కానని, అలా జరగాలంటే కొంత సమయం పడుతుందన్నాడు. తనతో సుదీర్ఘ కాలం ప్రయాణం చేసిన వారికి మాత్రమే అర్దమవుతానన్నాడు.ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ధనుష్ పై ఆరోపణలు చేసిన వారికి....తనని అర్దం చేసుకోని వారికి ఇలా పరోక్షంగా కౌంటర్ వేసాడని ప్రచారం జరుగుతోంది.