లేడీ సూపర్ స్టార్ తో ఆ సినిమాకి సీక్వెల్ !
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ సన్నాహాకాలు జరుగుతున్నాయి. 'మూకుత్తి అమ్మన్ 2' టైటిల్ తో రూపొందించడానికి రెడీ అవుతున్నారు.;
'లేడీ సూపర' స్టార్ నయనతార ప్రధాన పాత్రలో ఆర్జే బాలాజీ తెరకెక్కించిన లేడీ ఓరియేంటెడ్ చిత్రం 'మూకుత్తి అమ్మన్' అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిదే. తెలుగులో ఈచిత్రం 'అమ్మోరు తల్లి' టైటిల్తో అనువాదమైంది. ఇక్కడా సినిమాకు మంచి ఆదరణ దక్కింది. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ సన్నాహాకాలు జరుగుతున్నాయి. 'మూకుత్తి అమ్మన్ 2' టైటిల్ తో రూపొందించడానికి రెడీ అవుతున్నారు.
అయితే సీక్వెల్ కి దర్శకుడు మారిపోయాడు. సుందర్. సిసీక్వెల్ బాధ్యతలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్దమైంది. ఈ నెల 6 న చిత్రాన్ని చెన్నైలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలన్నది ప్లాన్. దీనిలో భాగంగా చెన్నైలో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన సోషియో ఫాంటసీ చిత్రమిది. ఈ చిత్రాన్నితమిళ్ లో తెరకెక్కించి పాన్ ఇండియాలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
హారర్ థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించడంలో సుందర్. సికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అందులోనూ ఆద్యాత్మిక అంశాన్నిబేస్ చేసుకుని అతడు కనెక్ట్ చేసే విధానం కన్విన్సింగ్ గానూ ఉంటుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాలతో సత్తా చాటాలని నయనతార ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. కానీ అవి ఆశించిన విధంగా ఫలితాలు సాధించడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినా? కంటెంట్ బలంగా లేకపోవడంతో తేలిపోతున్నాయి.
ఈ సినిమాల కోసం నయన్ ఎంతగానో శ్రమిస్తుంది. అమ్మోరు తల్లి సినిమాతో బాగానే ఫేమస్ అయింది. కానీ ఆ తర్వాత అలాంటి సినిమా మళ్లీ పడలేదు. ఈ నేపథ్యంలో అమ్మడు సీక్వెల్ పై చాలా ఆశలు పెట్టుకుంది. 'మూకుత్తి అమ్మన్' ఐదేళ్ల క్రితం రిలీజ్ అయింది.