అన్ని జ‌న‌రేష‌న్ల హీరోల్ని క‌వ‌ర్ చేసిన ఏకైక హీరోయిన్!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార జర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు ద‌శాబ్ధాల‌కు పైగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతుంది.

Update: 2024-12-17 07:00 GMT

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార జర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు ద‌శాబ్ధాల‌కు పైగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతుంది. లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తో సోలోగానూ స‌త్తా చాటుతుంది. న‌య‌న్ ఇన్నేళ్ల ప్ర‌యాణంలో ఎంతో మంది హీరోయిన్లు వ‌చ్చారు..వెళ్లారు. కానీ త‌న‌కు మాత్రం తానే పోటీగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోలే క్యూలో ఉన్నా? అమ్మ‌డు మాత్రం అక్క‌డ సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేదు. `జ‌వాన్` ఇచ్చిన స‌క్సెస్ తోనే ఇది సాద్యమైంద‌న్న‌ది తెలిసిందే.

సౌత్ లో దాదాపు స్టార్ హీరోలంద‌రితోనూ సినిమాలు చేసింది. ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్, చిరంజీవి నుంచి ఆ త‌ర్వాత జ‌న‌రేష‌న్ హీరోల వ‌ర‌కూ అంద‌రితోనూ క‌లిసి ప‌నిచేసింది. తాజాగా అమ్మ‌డు యువ న‌టుడు క‌విన్ తోనూ న‌టిస్తోంది. ఈ నేప‌థ్యంలో న‌య‌న్ ఒక్క‌సారిగా తాను న‌టించిన హీరోలంద‌ర్నీ గుర్తు చేసుకుంది. తొలి జ‌న‌రేష‌న్ కు చెందిన ర‌జనీకాంత్, మోహ‌న్ లాల్, మ‌మ్ముట్టి, చిరంజీవిల‌తో న‌టించాను. రెండ‌వ జ‌న‌రేష‌న్ కు చెందిన విజ‌య్, అజిత్ తోనూ సినిమాలు చేసాను.

మూడ‌వ జ‌న‌రేష‌న్ కు చెందిన సూర్య‌, విక్ర‌మ్ తోనూ, నాల్గ‌వ జ‌న‌రేష‌న కు చెందిన ధ‌నుష్, శింబులతోనూ పనిచే సాను. అయిద‌వ జ‌ర‌నేష‌న్ కు చెందిన శివ కార్తికేయ‌న్ తో సినిమాలు చేసాను. ప్ర‌స్తుతం ఆర‌వ జ‌న‌రేష‌న్ హీరో అయిన క‌విన్ తో న‌టిస్తున్నా. ఇలా ఇన్ని జ‌న‌రేష‌న్ హీరోల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం గొప్ప అనుభ‌వాన్నిచ్చింది. ఇదొక రిమార్క్ బుల్ జ‌ర్నీ` అని తెలిపింది. ఇలా సీనియ‌ర్ల నుంచి జూనియ‌ర్ హీరోల వ‌ర‌కూ ఏ హీరోయిన్ సినిమాలు చేయ‌లేదు.

అయితే ఇక్క‌డ అవ‌కాశం అన్న‌ది కీల‌క విష‌యం. న‌య‌న‌తార‌కు వాళ్ల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది కాబ‌ట్టి చేయ‌గ‌ల్గింది. ప్ర‌స్తుతం న‌య‌న‌తార వ‌య‌సు 40. అయినా అమ్మ‌డు 30 ఏళ్ల భామ‌లో అల‌రిస్తుంది. విగ్నేష్ శివ‌న్ ని వివాహం చేసుకుని ధాంప‌త్య జీవితంలోకి అడుగు పెట్టిన త‌ర్వాత అమ్మ‌డి స్టార్ డ‌మ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది.

Tags:    

Similar News