సూపర్ స్టార్‌ ఇంటి పక్కకి లేడీ సూపర్‌ స్టార్‌ షిప్ట్‌

ఇన్నాళ్లు ఒక అపార్ట్‌మెంట్‌ లో భర్త విఘ్నేష్ మరియు పిల్లలతో కలిసి ఉన్న లేడీ సూపర్ స్టార్ నయతార ఇప్పుడు కొత్త ఇంటికి షిప్ట్‌ అయ్యింది.

Update: 2024-07-04 15:30 GMT

లేడీ సూపర్ స్టార్‌ నయనతార మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే కూడా తమ పిల్లల ఫోటోలను షేర్ చేయడం, హాలీడేస్ ని ఎంజాయ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి నయనతార వార్తల్లో నిలిచింది.

ఇన్నాళ్లు ఒక అపార్ట్‌మెంట్‌ లో భర్త విఘ్నేష్ మరియు పిల్లలతో కలిసి ఉన్న లేడీ సూపర్ స్టార్ నయతార ఇప్పుడు కొత్త ఇంటికి షిప్ట్‌ అయ్యింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసం ఉన్న పోయేస్‌ గార్డెన్‌ ప్రాంతంలో నయనతార కొత్త ఇల్లు కట్టించుకున్నట్లుగా తెలుస్తోంది.

పోయేస్ గార్డెన్‌ ప్రాంతంలోనే తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ఇల్లు ఉన్న విషయం తెల్సిందే. ఇప్పుడు ఆయన ఇంటికి చాలా దగ్గరగా నయనతార, విఘ్నేష్ శివన్ ల ఇల్లు ఉన్నట్లు తమిళ మీడియా వర్గాల వారు అంటున్నారు. ఇటీవలే హిందూ మరియు క్రిస్టియన్‌ ఆచారాల ప్రకారం గృహ ప్రవేశం జరిగిందట.

హీరోయిన్‌ గా ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేయడం లేదు అంటూ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు నయనతార కు సంబంధించిన సినిమాల గురించి సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా వెతుకుతూనే ఉన్నారు.

నయతార తెలుగు మరియు తమిళ్‌ లో రూపొందుతున్న పలు సినిమాలతో రాబోయే రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ముందు ముందు ఈ అమ్మడు మరిన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News

eac