చిరుత బ్యూటీ బోయ్‌ఫ్రెండ్ ఏడ‌డుగుల బుల్లెట్టు

అత‌డు డెనిమ్ షార్ట్ లో క‌నిపించ‌గా, నేహా కూడా షార్ట్ తెల్ల‌చొక్కాలో సింపుల్ గా క‌నిపించింది. ముఖ్యంగా నేహా శ‌ర్మ బోయ్ ఫ్రెండ్ 7 అడుగ‌ల ఎత్తుతో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

Update: 2025-01-07 14:09 GMT

విదేశీ క్రీడాకారుల‌తో హిందీ న‌టీమ‌ణుల ప్రేమాయ‌ణాలు, పెళ్లి వ్య‌వ‌హారాలు అన్నివేళ‌లా హాట్ టాపిక్. ఇటీవ‌లే తాప్సీ ప‌న్ను తాను ప్రేమించిన మాథియాస్ బోని పెళ్లాడింది. అత‌డు బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు.. కోచ్. అంత‌కుముందు ప‌లువురు హిందీ చిత్ర‌సీమ క‌థానాయిక‌లు విదేశీ క్రికెట‌ర్ల‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

అపుడు రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న 'చిరుత' చిత్రంలో న‌టించిన నేహాశ‌ర్మ క్రొయేషియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు పీటర్ స్లిస్కోవిచ్‌తో ప్రేమ‌లో ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అత‌డితో జంట‌గా షికార్ చేస్తూ కెమెరాకు చిక్కింది ఈ బ్యూటీ. ఈ జంట‌ ముంబైలో ప‌దే ప‌దే షికార్ల‌లో కనిపించడంతో ఈ విష‌యం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. గత కొన్ని వారాలుగా నేహా శ‌ర్మ‌ ముంబైలో పీటర్ స్లిస్కోవిచ్‌తో రెగ్యుల‌ర్ గా కనిపిస్తోంది.

ఆ ఇద్ద‌రూ చెట్టాప‌ట్టాల్ అంటూ బ‌హిరంగంగా షికార్ చేస్తుంటే వారిపై గాసిప్స్ వైర‌ల్ గా మారుతున్నాయి. గత రాత్రి త‌న స్నేహితుడు పీట‌ర్, సోద‌రి ఐషా శర్మతో కలిసి డిన్నర్ డేట్ కోసం బయలుదేరిన‌ప్పుడు నేహా శ‌ర్మ‌ కెమెరాల‌కు చిక్కింది. పీటర్ నేహా భుజం చుట్టూ చేయి వేసి ఎంతో స‌న్నిహితంగా కనిపించాడు. నేహా శ‌ర్మ చాలా సంతోషంగా కనిపించింది.

అత‌డు డెనిమ్ షార్ట్ లో క‌నిపించ‌గా, నేహా కూడా షార్ట్ తెల్ల‌చొక్కాలో సింపుల్ గా క‌నిపించింది. ముఖ్యంగా నేహా శ‌ర్మ బోయ్ ఫ్రెండ్ 7 అడుగ‌ల ఎత్తుతో ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అత‌డి చెంత నేహా చాలా షార్ట్ గా క‌నిపిస్తోంది. షికార్ స‌మ‌యంలో నేహా శ‌ర్మ న‌వ్వులు చిందిస్తూ ఉల్లాసంగా క‌నిపించింది. కొద్ది రోజుల క్రితం ఈ జంట‌ చేయి చేయి కలిపి నడుస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేహా తన వ్యక్తిగత జీవితం ఏదీ ప్ర‌క‌టించిక‌పోయినా కానీ ఇప్పుడు క్రీడాకారుడికి లాక్ అయిన‌ట్టేన‌ని అంతా భావిస్తున్నారు. ఇంత‌కీ పీటర్ స్లిస్కోవిక్ ఎవరు? అన్న వివ‌రాలే తెలియాల్సి ఉంది.

పీటర్ స్లిస్కోవిక్ 33 ఏళ్ల క్రొయేషియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతను స్ట్రైకర్‌గా నిపుణుడు. 2011లో జర్మనీలో మెయిన్జ్ 05తో ఫుట్ బాల‌ర్ గా వృత్తిలోకి అరంగేట్రం చేసాడు. తరువాత ప‌లు ఫుట్‌బాల్ క్లబ్‌ల కోసం ఆడాడు. ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్‌ల కోసం ఆడిన తర్వాత ఒక సంవత్సరం ఒప్పందంపై జూలై 2022లో ఇండియన్ సూపర్ లీగ్ (ISL) క్లబ్ చెన్నైయిన్ FCకి మారాడు. తర్వాత జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీకి ఆడుతున్నాడు. అత‌డి టెక్నిక్ గోల్ స్కోరింగ్ నైపుణ్యం అత‌డిని పాపుల‌ర్ చేసాయి. పీటర్ అంతర్జాతీయంగాను అలాగే భారతదేశంలో కూడా గుర్తింపు పొందాడు. గత సీజన్ ఇండియన్ సూపర్ లీగ్‌లో, స్లిస్కోవిచ్ చెన్నైయిన్ ఎఫ్‌సి తరపున 17 గేమ్‌ల్లో ఆడాడు. ఎనిమిది గోల్స్ చేశాడు. సోష‌ల్ మీడియాల్లో అత‌డికి వేల‌ల్లో ఫాలోవ‌ర్స్ ఉన్నారు.

నేహా శర్మ 2007లో 'చిరుత' చిత్రంతో క‌థానాయిక‌గా అడుగుపెట్టింది. కెరీర్ ఆరంగేట్ర‌మే రామ్ చ‌ర‌ణ్ లాంటి ప్ర‌ముఖ‌ హీరో స‌ర‌స‌న నేహా శ‌ర్మ న‌టించింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో మాత్ర‌మే న‌టించింది. నేహా న‌టించిన చివ‌రి హిట్ సినిమా 'తాన్హాజీ'. 'ఇల్లీగల్' అనే వెబ్ సిరీస్‌లో న్యాయవాది నిహారిక సింగ్ పాత్రలో ఆక‌ట్టుకుంది.

Tags:    

Similar News