పిక్‌టాక్‌ : స్టైలిష్ లేడీ చిరుత

సినిమాల్లోనే కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తున్న నేహా శర్మ తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలను షేర్‌ చేసింది.;

Update: 2025-04-01 13:30 GMT
Neha Sharma Stunning Pictures

రామ్‌ చరణ్‌తో కలిసి సినిమా ఇండస్ట్రీలో 'చిరుత'తో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ నేహా శర్మ. మొదటి సినిమాతోనే సూపర్‌ హిట్‌ను దక్కించుకున్నప్పటికీ లక్‌ కలిసి రాలేదు. ఒక వైపు రామ్‌ చరణ్ బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకు పోతుంటే మరో వైపు నేహా శర్మ మాత్రం తక్కువ సమయానికే టాలీవుడ్‌లో కనిపించకుండా పోయింది. 2007లో చిరుత సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నేహా శర్మ టాలీవుడ్‌లో ఆ తర్వాత కుర్రాడు సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. కానీ లక్కీగా ఈ అమ్మడికి బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్‌లో ఈమె 2010 సంవత్సరంలో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్‌లో క్రమం తప్పకుండా సినిమాలు చేస్తూనే ఉంది.

Neha Sharma Stunning Pictures

గత ఏడాది బాలీవుడ్‌లో బాడ్ న్యూజ్ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో కనిపించిన నేహా శర్మ ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు ఉన్నాయని సమాచారం. బాలీవుడ్‌లో మళ్లీ బిజీ కావడం కోసం ఈమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అవకాశం వస్తే టాలీవుడ్‌, కోలీవుడ్‌లోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌ సినిమాలతో పాటు ప్రస్తుతం ఒక పంజాబీ సినిమాలోనూ ఈమె నటించడం విశేషం. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్న అందం విషయంలో నేహా శెట్టిలో ఏ మాత్రం మార్పు రాలేదు. పై పెచ్చు ఈమె మరింత అందంగా కనిపిస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. సోషల్‌ మీడియాలో ఈమె ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ ఉంటాయి.


సినిమాల్లోనే కాకుండా వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటిస్తున్న నేహా శర్మ తాజాగా మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి స్విమ్‌ సూట్‌లో బీచ్‌ ఫోటోలతో నేహా శర్మ సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. సాధారణంగానే నేహా శర్మ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతాయి. అలాంటిది ఈసారి స్కిన్‌ షో చేస్తూ, అది కూడా స్విమ్‌ సూట్‌లో కనిపించడంతో నెటిజన్స్ చూపు తిప్పలేక పోతున్నారు. నెట్టింట ఈ అమె ఫోటోలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. ఇంత అందంగా ఉన్న నేహా శర్మను ఎందుకు టాలీవుడ్‌ ప్రేక్షకులకు తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ దూరం చేశారంటూ కొందరు ఈ ఫోటోలకు తెగ ఫీల్‌ అయిపోతూ కామెంట్‌ చేస్తున్నారు.


బాలీవుడ్‌తో పాటు భవిష్యత్తులో టాలీవుడ్‌లోనూ ఈమె సినిమాలు చేయాలని కోరుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఆ మధ్య రాజకీయ వార్తలతో మీడియాలో నిలిచిన నేహా శర్మ తాజాగా మరోసారి ఈ ఫోటోలతో వార్తల్లో నిలిచింది. ఈమె సోదరి ఐషా శర్మ సైతం సోషల్‌ మీడియాలో సందడి చేస్తుంది. అక్క చెల్లి అందమైన ఫోటోలు షేర్‌ చేయడంలో పోటీ పడుతూ ఉన్నారు. ఈసారి చెల్లి ఐషా కంటే నేహా ఫోటోలు మరింత అందంగా ఉన్నాయంటూ నెటిజన్స్ కామెంట్స్‌ను సొంతం చేసుకుంది. నేహా శర్మ ఇదే అందంతో ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఈమెకు పిలిచి మరీ ఆఫర్లు ఇచ్చే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News