గర్ల్ ఇన్ గోల్డెన్ గౌన్.. రాధిక సో గ్లామరస్!
నేహా శెట్టి.. ఈ పేరు వింటేనే అందరికీ రాధిక రోల్ గుర్తుకు వచ్చేస్తుంది. బ్లాక్ చీరలో ఆమె వయ్యారంగా నిలుచున్న సీన్ మైండ్ లోకి వచ్చేస్తుంది
నేహా శెట్టి.. ఈ పేరు వింటేనే అందరికీ రాధిక రోల్ గుర్తుకు వచ్చేస్తుంది. బ్లాక్ చీరలో ఆమె వయ్యారంగా నిలుచున్న సీన్ మైండ్ లోకి వచ్చేస్తుంది. టాలీవుడ్ స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన డీజే టిల్లు మూవీతో అంతలా మెప్పించింది నేహా. రాధికగా అందరి మనసుల్లో నిలిచిపోయారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు.
కన్నడ బ్యూటీ అయిన నేహా శెట్టి.. ముంగారు మేల్ మూవీతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. శాండల్ వుడ్ లో ఆ సినిమా మిక్స్ డ్ టాక్ అందుకుంది. కానీ మూవీలో నేహ తన అందచందాలతో మెప్పించి.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరి హీరోగా నటించిన మెహబూబా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీలో ఓ చిన్న పాత్రలో కనిపించింది.
ఆ తర్వాత డీజే టిల్లు మూవీతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకున్నారు. గతేడాది బెదురులంక 2012, రూల్స్ రంజన్ చిత్రాల్లో యాక్ట్ చేసి, డీజే టిల్లు సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీలో నేహా శెట్టి గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించింది. టిల్లు క్యూబ్ లో కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలో కూడా కనిపించింది.
తన యాక్షన్ తో అందరినీ ఆకట్టుకున్నారు. రాధికగా చెరగని ముద్ర వేసుకున్న ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. తక్కువ టైమ్ లోనే మంచి ఫేమ్ సొంతం చేసుకున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో సందడి చేస్తుంటారు. కొత్త కొత్త పిక్స్ తో అట్రాక్ట్ చేస్తుంటారు. రోజురోజుకు ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు నేహా శెట్టి. తన గ్లామర్ తో మాయ చేస్తున్నారు.
తాజాగా కొత్త పిక్స్ ను షేర్ చేస్తూ.. గోల్డ్ కలర్ డ్రెస్ లో గ్లామర్ షో చేశారు. తన స్కిన్ అండ్ లెగ్స్ షోతో ఫిదా చేసింది. తన లుక్స్ తో మైమరిపించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్న నేహా నయా ఫోటోస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిక్స్ అదిరిపోయాయని చెబుతున్నారు. సెగలు రేపుతున్నాయని.. గర్ల్ ఇన్ గోల్డెన్ గౌన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.