'జైల‌ర్' తో తార‌క్ దాదాపు ఖాయ‌మేనా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే.

Update: 2025-02-11 09:30 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ పాన్ ఇండియా సినిమాకి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌మ్మ‌ర్ నుంచి ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ప్రీ ప్రొడ‌క్ష‌న్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తార‌క్ `వార్ 2` నుంచి రిలీవ్ అవ్వ‌గానే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని ప్ర‌ణాళిక‌తో ముందు కెళ్తున్నాడు. ఈ సినిమా మొద‌లు పెట్టి రిలీజ్ చేయ‌డానికి ఎలా లేద‌న్నా ఏడాదిన్న‌ర నుంచి రెండేళ్లు స‌మ‌యం ప‌డుతుంద‌న్న‌ది ఓ అంచ‌నా.

ఒక‌వేళ `దేవ‌ర 2` ఉంటే గ‌నుక రెండేళ్ల త‌ర్వాత మాటే అన్న‌ది నిన్న‌టివ‌ర‌కూ వినిపించిన ప్ర‌చారం. అయితే ఇప్పుడు `దేవ‌ర 2` స్థానంలో మ‌రో కొత్త ప్రాజెక్ట్ తెర‌పైకి వ‌స్తోంది. ఎన్టీఆర్ హీరోగా కోలీవుడ్ డైరెక్ట‌ర్ నెల్స‌న్ దిలీప్ కుమార్ ఓ ప్రాజెక్ట్ దిశ‌గా అడుగులు వేస్తున్నాడుట‌. ఇప్ప‌టికే తార‌క్ ని క‌లిసి లైన్ కూడా వినిపించాడుట‌. న‌చ్చ‌డంతో డెవ‌లెప్ చేయ‌మ‌ని తార‌క్ సూచించాడుట‌. ఇదే నిజ‌మ‌తే? ప్ర‌శాంత్ నీల్ సినిమ ఆర్వాత నెల్సన్ ప్రాజెక్ట్ కి ఛాన్సులు ఎక్కువ‌గా ఉన్నాయి.

ఎందుకంటే `దేవ‌ర` పై చాలా నెగిటివిటీ ఉంది. ఈ నేప‌థ్యంలో `దేవ‌ర‌2` చేస్తారా? లేదా? అన్న‌ది ఇంకా సందేహంగానే ఉంది. పై కి చేస్తామ‌ని చెబుతున్నా? నిజంగా చేయాల‌నుకుంటే తార‌క్ ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన వివ‌రాలు అందించారు అన్న‌ది ఓ వ‌ర్గం మాట‌. దాన్ని బేస్ చేసుకుంటే దేవ‌ర‌2 దాదాపు లేన‌ట్లే. ఇక నెల్స‌న్ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌డానికి రెండేళ్లు ప‌డుతుంది. ప్ర‌స్తుతం నెల్స‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా `జైల‌ర్ 2`ని ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు.

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ `కూలీ` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఆగ‌స్టులో రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యం లో ఏప్రిల్ ..మే వ‌ర‌కూ షూటింగ్ జ‌రుగుతుంద‌నే ప్ర‌చారంలో ఉంది. ఈ సినిమా రిలీజ్ అనంత‌రం ర‌జ‌నీకాంత్ కొంత విరామం తీసుకుంటున్నారు. అనంత‌రం నేరుగా `జైల‌ర్ 2` షూట్ లో పాల్గొంటారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయ‌డానికి ఎలా లేద‌న్నా ఏడాదిన్న‌ర ప‌డుతుంద‌ని అంచ‌నా. ఈలోగా తార‌క్ - ప్ర‌శాంత్ నీల్ సినిమా కూడా ఓకొలిక్క వ‌స్తుంది. దాన్ని బ‌ట్టి నెల్స‌న్ సినిమాకి తారక్ డేట్టు షెడ్యూల్ చేసే అవ‌కాశం ఉంటుంది.

Tags:    

Similar News