జైలర్ 2… నెల్సన్ ప్లానింగ్ మారిపోయిందా?
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. కోలీవుడ్ లో థర్డ్ హైయెస్ట్ కలెక్షన్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఈ సినిమాలో రజినీకాంత్ క్యారెక్టర్ ఎలివేషన్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. దానికి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన అనిరుద్ రవిచందర్ సినిమా సక్సెస్ లో మేజర్ పార్ట్ అయ్యాడు. ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ కి బలంగా రీచ్ అయ్యిందంటే అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఒక కారణం అని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే ఈ మూవీ తర్వాత గ్యాప్ తీసుకున్న నెల్సన్ దిలీప్ మరల ‘జైలర్ 2’పైన వర్క్ చేయడం మొదలు పెట్టాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ కి కథ చెప్పి ఒకే చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసాడు. 2025 జనవరి తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టాలని నెల్సన్ దిలీప్ అనుకున్నారు. అలాగే 2025 దీపావళికి ‘జైలర్ 2’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని ప్లాన్ చేశారు.
అయితే ఇప్పుడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ ప్లాన్ మార్చుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా కంటెంట్ ని మరింత స్పాన్ పెంచి చెప్పాలని అనుకుంటున్నాడంట. పాన్ ఇండియా రేంజ్ లో ‘జైలర్ 2’ సినిమా కథని హైవోల్టేజ్ లో ప్రెజెంట్ చేయాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే ఈ మూవీ రిలీజ్ ని 2026 సమ్మర్ కి ప్లాన్ చేశారంట. అంటే 2025లో ‘జైలర్ 2’ ఇక థియేటర్స్ లోకి రానట్లే అని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. నెల్సన్ దిలీప్ ఈ విషయాన్ని అధికారికంగా అయితే ఎక్కడ చెప్పలేదు.
కానీ ఈ ప్రచారం ప్రస్తుతం విస్తృతంగా జరుగుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చే ఏడాది లోకేష్ కనగరాజ్ ‘కూలీ’ మూవీ రానుంది. మాఫియా బ్యాక్ డ్రాప్ కథతోనే హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతోనే ఈ మూవీ ఉండబోతోంది. ఈ సినిమాపై అంచనాలు కూడా హెవీగానే ఉన్నాయి. ఈ ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి వచ్చిన ‘వేట్టయ్యన్’ డిజాస్టర్ అయ్యింది. దీంతో ఫ్యాన్స్ కూలీపైన హోప్స్ పెట్టుకున్నారు.
‘జైలర్’ సినిమా ఎండింగ్ లోనే నెల్సన్ దిలీప్ పార్ట్ 2కి లీడ్ ఇచ్చాడు. ఈ సారి సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం పవర్ ఫుల్ మాఫియాని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. అయితే సూపర్ స్టార్ కి ప్రతినాయకుడిగా ఈ చిత్రంలో ఎవరు కనిపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.