నెట్‌ఫ్లిక్స్ : టాప్ 10 లో అయిదు మనవే
ఇండియాలో అత్యధికంగా ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్ ను చూస్తున్నట్లుగా మీడియా వర్గాల అంచనా.
ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. ఇండియాలో భారీ మొత్తంలో సబ్ స్క్రైబర్స్ ఉన్న నెట్ ఫ్లిక్స్ లో ఇండియన్ కంటెంట్ తో పాటు హాలీవుడ్ ఇతర దేశాల భాషల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఇండియాలో అత్యధికంగా ప్రైమ్ తో పాటు నెట్ ఫ్లిక్స్ ను చూస్తున్నట్లుగా మీడియా వర్గాల అంచనా. ఈ మధ్య కాలంలో వరుసగా పెద్ద సినిమాలను హిట్ సినిమాలను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసి స్ట్రీమింగ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఇండియా వ్యాప్తంగా ట్రెండ్డింగ్ లో ఉన్న సినిమాల జాబితాను నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది.
టాప్ 10 ట్రెండ్ లో మన సౌత్ సినిమాలు అయిదు ఉండటం విశేషం. అందులో కూడా మన తెలుగు సినిమాలు సలార్ మరియు హాయ్ నాన్న సినిమాలు నాలుగు స్థానాలను ఆక్రమించాయి. హాయ్ నాన్న తెలుగు మరియు హిందీ వర్షన్ ట్రెండ్డింగ్ అవుతోంది. ఇక సలార్ తెలుగు మరియు తమిళ వర్షన్ లు ట్రెండ్ అవుతున్నాయి.
నెం.1 స్థానంలో సలార్ తెలుగు వర్షన్ ఉంది. అయిదవ స్థానంలో సలార్ తమిళ వర్షన్ నిలిచింది. మూడు మరియు ఆరు స్థానాల్లో హాయ్ నాన్న ఉంది. రెండో స్థానంలో లిఫ్ట్ అనే సినిమా ఉంది. ఇక కేరళలో జరిగిన సంఘటన ఆధారంగా రూపొందిన కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ కూడా టాప్ లో ఉంది. 9వ స్థానంలో ఈ డాక్యుమెంటరీ ఉంది.
మొత్తానికి నెట్ ఫ్లిక్స్ లో సౌత్ ఇండియన్ కంటెంట్ ఆధిపత్యం కనబర్చుతోంది. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా రూపొందిన సలార్ మరియు హాయ్ నాన్న సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నాయి.