దేవర.. కొరటాల కొత్త టెన్షన్

వరుసగా నాలుగు సక్సెస్ లతో స్టార్ డైరెక్టర్స్ జాబితాలోకి వచ్చిన కొరటాల శివకి ‘ఆచార్య’ మూవీతో కోలుకోలేని దెబ్బ తగిలింది.

Update: 2024-09-28 09:42 GMT

వరుసగా నాలుగు సక్సెస్ లతో స్టార్ డైరెక్టర్స్ జాబితాలోకి వచ్చిన కొరటాల శివకి ‘ఆచార్య’ మూవీతో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సినిమా అతని ఇమేజ్ మొత్తాన్ని దెబ్బతీసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీ మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో కూడా బిగ్గెస్ట్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కారణంగా కొరటాల శివపై దారుణమైన ట్రోలింగ్ జరిగింది. అయితే ‘ఆచార్య’ టెన్షన్స్ నుంచి బయటకొచ్చిన కొరటాల శివ ఎన్టీఆర్ తో ‘దేవర’ మూవీ చేశారు.

పాన్ ఇండియా రేంజ్ లో హైవోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ఫ్యాన్స్ కి అయితే సినిమా బాగానే కనెక్ట్ అయ్యింది. ‘దేవర’ సినిమాతో కొరటాల శివకి సోషల్ మీడియా ట్రోలింగ్ తగ్గుతుందని అనుకుంటే మరింత పెరిగిందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ‘దేవర’ సినిమా గురించే చర్చ నడుస్తోంది.

కొంతమంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటే మరికొంతమంది నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. అయితే ఈ రెండు చర్చల్లో కామన్ గా కొరటాల శివ పేరు వినిపిస్తోంది. దీనికి కారణం మూవీ ప్రారంభమైనప్పుడు కొరటాల శివ ఇచ్చిన హైప్ అనే మాట వినిపిస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఈ ట్రైలర్ రిలీజ్ అయినపుడు మూవీలో ఇంటరెస్టింగ్ ట్విస్ట్ ఉంటుందనే టాక్ వినిపించింది..

అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత చాలా మంది ఈ మూవీ స్టోరీ ఎలా ఉంటుందో గెస్ చేసి కథనాలు ప్రసారం చేశారు. యుట్యూబ్ ఛానల్స్ లో ఎవరికి నచ్చిన విధంగా వారు ‘దేవర’ కథ గురించి చెప్పారు. అయితే వీటికి భిన్నంగా కొరటాల కథ చెప్పి ఉంటాడని ఫ్యాన్స్ గెస్ చేశారు. మూవీ రిలీజ్ తర్వాత సినిమా స్టోరీ అందరూ గెస్ట్ చేసిన విధంగా ఉందనే మాట సోషల్ మీడియా వినిపిస్తోంది. సినిమా చూస్తున్నంత సేపు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుందనేది గెస్ చేసేలా నేరేషన్ ఉందని అంటున్నారు.

రొటీన్ ఫార్ములలో మాస్ మసాలా కథాశంతోనే కొరటాల శివ ఈ సినిమా కథని చెప్పాడని క్రిటిక్స్ తెలిపారు. సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, ఎలివేషన్ బాగానే ఉంది. కొరటాల స్టోరీ నేరేషన్ మాత్రం వీక్ గా ఉందని కామెంట్స్ సోషల్ మీడియాలో రివ్యూలు వస్తున్నాయి. పబ్లిక్ టాక్ లో కూడా కొరటాల మీదనే ఎక్కువ నెగిటివిటీ వస్తోంది. దీంతో ‘దేవర’ సినిమాతో కొరటాల శివకి కొత్త టెన్షన్ మొదలైందనే మాట వినిపిస్తోంది. ఇక సినిమా ఫైనల్ రిజల్ట్ ఏమిటనేది తెలియాలి అంటే ఈ వీకెండ్ వరకు ఆగాల్సిందే.

Tags:    

Similar News