మెగా లావణ్య 'సతీ లీలావతి' - ఫైనల్ గా అప్డేట్ వచ్చేసింది
ఇప్పుడు అటు ఫ్యామిలీ లైఫ్ ను.. ఇటు కెరీర్ ను బ్యాలెన్స్ గా నడిపిస్తున్నారు లావణ్య. అదే సమయంలో తాజాగా ఆమె కొత్త ప్రాజెక్ట్ సతీ లీలావతి అనౌన్స్మెంట్ వచ్చింది.
హీరోయిన్ లావణ్య త్రిపాఠికి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందాల రాక్షసి మూవీతో తెలుగు సినీ ప్రియులను పలకరించిన ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ఎందరో మనసులు దోచుకున్నారు. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.
కెరీర్ లో ఎక్కువగా యంగ్ హీరోలతో వర్క్ చేసిన లావణ్య త్రిపాఠి.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సమయంలో వరుణ్ తో ప్రేమలో పడ్డారు. తమ లవ్ మ్యాటర్ ఎక్కడా బయటపడకుండా కొన్నాళ్లపాటు జాగ్రత్తగా నడిపించారు. గత ఏడాది డిస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని మెగా కోడలుగా మారారు లావణ్య త్రిపాఠి.
ఇప్పుడు అటు ఫ్యామిలీ లైఫ్ ను.. ఇటు కెరీర్ ను బ్యాలెన్స్ గా నడిపిస్తున్నారు లావణ్య. అదే సమయంలో తాజాగా ఆమె కొత్త ప్రాజెక్ట్ సతీ లీలావతి అనౌన్స్మెంట్ వచ్చింది. ఆదివారం లావణ్య బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ చెబుతూ మూవీని ప్రకటించారు మేకర్స్. భీమిలి కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి) వంటి పలు విభిన్నమైన చిత్రాలతో మెప్పించిన తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.
దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్ల పై ప్రొడక్షన్ నెం.1గా నాగమోహన్ బాబు, రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే సతీ లీలావతి చిత్రంతో మరోసారి డిఫరెంట్ రోల్, ఎగ్జయిటింగ్ కథాంశంతో మెప్పించడానికి లావణ్య త్రిపాఠి సిద్ధమయ్యారని నిర్మాతలు తెలిపారు. త్వరలో మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు. మరిన్ని వివరాలను కొద్దిరోజుల్లో తెలియజేస్తామని అన్నారు. మేకర్స్ రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ లో సింపుల్ గా.. ట్రెడిషనల్ గా ఉన్నారు లావణ్య.
ఇక సినిమా విషయానికొస్తే.. లావణ్య త్రిపాఠితో పాటు పలువురు ప్రముఖులు నటిస్తున్నారు. వారి పేర్లను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడిగా వ‌్యవహరిస్తున్నారు. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తున్నారు. కోసనం విఠల్ ఆర్ట్ డైరెక్టర్ గా, సతీష్ సూర్య ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరి సతీ లీలావతి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.