ఈ స‌క్సెస్ లు కొత్త వాళ్ల ట్యాలెంట్ కి సంకేతాలు!

కానీ కొంత మంది టైర్ -2 హీరోలు...టైర్-3 హీరోలు మాత్రం కొన్నిసార్లు రిస్క్ తీసుకుని బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టేస్తున్నారు.

Update: 2024-11-02 21:30 GMT

ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ ఉంటేనే స్టార్ హీరోలు అవ‌కాశాలిస్తారు. లేదంటే? పాత విజ‌యాల్ని చూసి ఇచ్చే ప‌రిస్థితి లేదు. ఆ డైరెక్ట‌ర్ ఫాంలో ఉన్నాడా? లేడా? ఎలాంటి క‌థ‌లు రాస్తాడు? కంటెంట్ ఎలా ఉంటుంది? ఇలా ఎన్నో లెక్క‌లు బేరీజు వేసుకుని అవ‌కాశాలిస్తుంటారు. కానీ కొంత మంది టైర్ -2 హీరోలు...టైర్-3 హీరోలు మాత్రం కొన్నిసార్లు రిస్క్ తీసుకుని బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్టేస్తున్నారు.

`ద‌స‌రా`తో శ్రీకాంత్ ఓదేల‌..`డిజేటిల్లు` తో విమ‌ల్ కృష్ణ‌, `టిల్లు స్క్వేర్` తో మ‌ల్లిక్ రాం, `జైహ‌నుమాన్` తో ప్ర‌శాంత్ వ‌ర్మ‌, శేలేష్ కొల‌ను, రీసెంట్ రిలీజ్ `క‌`తో ద‌ర్శ‌క‌ద్వ‌యం సుదీప్-సందీప్ లాంటి వారు ఇప్పుడు ఇండ‌స్ట్రీకి న్యూ ట్రెండ్ ని ప‌రిచ‌యం చేసారనొచ్చు. డైరెక్ట‌ర్లుగా మారాల‌నుకుంటోన్న వారికి వీళ్ల స‌క్సెస్ అన్న‌ది ఓ కొల‌మానంగా, ఓ స్పూర్తిగా చెప్పొచ్చు. వాస్త‌వానికి తెలుగు సినిమా ట్రెండ్ ఆరేడేళ్ల క్రిత‌మే మారింది. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు.

భాష‌తో సంబంధం లేకుండా ఎలాంటి న‌టుడు కొత్త జాన‌ర్ ని ట‌చ్ చేసినా ఆద‌రిస్తున్నారు. అయితే అదంతా ప‌ర‌భాషా కంటెంట్...స‌హా అక్క‌డి ద‌ర్శ‌కుల‌కే అది చెల్లింది అన్న‌ది మొన్న‌టి వ‌ర‌కూ ఉన్న మాట‌. ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది. టాలీవుడ్ నుంచి వ‌స్తోన్న కొత్త కుర్రాళ్లు ఎంతో ఇన్నే వేటివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కొంత పంథాలో తీసుకెళ్ల‌డంలో నూరు శాతం స‌క్సెస్ అవుతున్నారు. ట్రెండ్ ని , ప్రేక్ష‌కుల ప‌ల్స్ ని ప‌ట్టుకుని సినిమాలు చేస్తున్నారు.

రెండు న్న‌ర గంట‌ల సినిమా అంటే ఆర‌గంట బోర్ కొట్టించినా రెండు గంట‌ల పాటు ప్రేక్ష‌కుల్ని సీట్ ఎడ్జ్ న కూర్చో బెట్టాలి? అన్న త‌ర‌హా కంటెంట్ కోసం త‌పిస్తున్నారు. ఇంకా ఇలాంటి ప్ర‌తిభావంతులు కృష్ణాన‌గ‌ర్, చిత్ర‌పురి కాల‌నీలో చాలా మంది ఉన్నారు. అవ‌కాశాల రాక ఎదురు చూస్తున్నారు. హీరోలంతా అలాంటి ఆణిముత్యాల్ని వెతికి ప‌ట్టుకోవాలి.

Tags:    

Similar News