పౌజీ కొత్త పోరాటం వచ్చే వారం నుంచేనా!
అయితే ఇప్పటి వరకూ మేజర్ షెడ్యూల్స్ మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో భారీ సన్నివేశాలకు యూనిట్ రంగం సిద్దం చేస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో `పౌజీ` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. సినిమా ప్రారంభమైన నాటి నుంచి గ్యాప్ లేకుండా హను అండ్ కో సెట్స్ లో ఉంది. వివిధ లొకేషన్లలో సన్నివేశాలు చిత్రీకరించారు. అయితే ఇప్పటి వరకూ మేజర్ షెడ్యూల్స్ మొదలవ్వలేదు. ఈ నేపథ్యంలో భారీ సన్నివేశాలకు యూనిట్ రంగం సిద్దం చేస్తోంది.
వచ్చే వారం నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. ఇందులో కీలకమైన యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ గా ఉండే మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇది లాంగ్ షెడ్యూల్ అని సమాచా రం. ప్రధాన తారగాణమంతా షూట్ లో పాల్గొంటారుట. ప్రభాస్ కూడా జాయిన్ అవుతాడని సమాచారం. ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలు ప్రభాస్ పోర్షన్ పైనే ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమా హాలీవుడ్ చిత్రంలో ఉండబోతుందని ఇప్పటికే హింట్ అందేసింది.
కథలో ట్విస్ట్ లు నెవ్వెర్ బిఫోర్ గా ఉంటాయని రైటర్ల బృందం చెబుతుంది. కథ పూర్తిగా 1940 బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. హను శైలి లవ్ స్టోరీతో పాటు, బలమైన డ్రామా, భారీ యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఇదంతా కూడా దేశ భక్తి నేపథ్యంతో మిళితమై ఉంటుంది. అదీ స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ. ఇది. అప్పటి వాతావరణాన్నిస్పృషిస్తూ అద్భుతమైన సెట్లు నిర్మిస్తున్నారు.
ప్రేక్షకుడికి కొత్త అనుభూతి అందించేలా...సరికొత్త ప్రపంచంలోకే హను తీసుకెళ్లబోతున్నాడు. దానికి సంబంధించి రామోజీ ఫిలిం సిటీ సహా సిటీలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకమైన సెట్లు కూడా వేస్తున్నారు. ఆ సెట్లు ఖర్చు కూడా భారీగా ఉంటుందని తెలుస్తోంది. `సీతారామం` తరహాలోనే `పౌజీ` కథకు కూడా ఏదైనా స్పూర్తి ఉందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అయితే వాటికి సమాధానం ఇవ్వాల్సింది హను మాత్రమే. ఇందులో ప్రభాస్ కి జోడీగా ఇమాన్వీ ఇస్మాయిల్ అనే ఓ కొత్త భామను తీసుకున్న సంగతి తెలిసిందే.