సంచలన హిట్ ప్రాంచైజీ నుంచి హీరో ఔట్!
అందులో ఎక్కువగా బాగా ఫేమస్ అయింది డేనియల్ క్రేగ్. జెమ్స్ బాండ్ సినిమాలంటే అందరికీ డేనియల్ పేరు ఎక్కువగా గుర్తొస్తుంది.
జేమ్స్ బాండ్ ప్రాంచైజీ వరల్డ్ వైడ్ ఎంత ఫేమస్ అన్నది చెప్పాల్సిన పనిలేదు.. థ్రిల్లింగ్ సబ్జెక్టుతో.. అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో జేమ్స్ బాండ్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. ఆ ప్రాంచైజీ నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే? ప్రేక్షకుల్లో ఒకటే ఉత్కంఠ కనిపి స్తుంది. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వసూళ్లతో అలాగే షేక్ అవుతుంది. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటి వరకు 25 సినిమాలు వచ్చాయి. ఆరుగురు జేమ్స్ బాండ్ క్యారెక్టర్ లో నటించారు.
అందులో ఎక్కువగా బాగా ఫేమస్ అయింది డేనియల్ క్రేగ్. జెమ్స్ బాండ్ సినిమాలంటే అందరికీ డేనియల్ పేరు ఎక్కువగా గుర్తొస్తుంది.ఆ సిరీస్ ఎవరికి రానంత గుర్తింపు డేనియల్ కి మాత్రమే వచ్చింది. చివరిసారిగా 2021లో `నో టైం టు డై` సినిమా రాగా అందులో డేనియల్ క్రేగ్ బాండ్ గా మెప్పించాడు. ఇప్పటి వరకూ డేనియల్ మొత్తం అయిదు జేమ్స్ బాండ్ సినిమాల్లో నటించాడు. త్వరలో 26వ జేమ్స్ బాండ్ సినిమా మొదలవుతుంది. అయితే ఈసారి డేనియల్ మాత్రం బాండ్ అవతారానికి దూరంగా ఉన్నాడు.
వయసు రీత్యా కొత్త సినిమాలో నటించడానికి డేనియల్ ఆసక్తి చూపించలేదని సమాచారం. దీంతో అతడి స్థానంలో కొత్త బాండ్ ని తెరపైకి తెస్తున్నారు. హాలీవుడ్ హీరో ఆరోన్ టేలర్ జాన్సన్ పేరు ప్రముఖంగా చర్చకొస్తుంది. దాదాపు ఆయన ఖాయమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇతడు నటుడిగా చాలా సీనియర్. దాదాపు రెండు దశాబ్ధాలుగా హాలీవుడ్లో సినిమాలు చేస్తున్నాడు. `కిక్ యాస్`..` ఎవెంజర్స్`.. `గాడ్జిల్లా`..` టెనెట్`.. `బులెట్ ట్రైన్` లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ టేలర్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని క్రిస్టోపర్ నోలన్ డైరెక్ట్ చేస్తారని హాలీవుడ్ వర్గాల టాక్. బ్యాట్ మ్యాన్ ..ది డార్క్ నైట్..ఇన్ సెప్షెన్..మ్యాన్ ఆఫ్ స్టీల్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించారు. చివరిగా 2016 లో బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ తెరకెక్కించారు. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు జేమ్స్ బాండ్ ప్రాంచైజీకి అవకాశం దక్కింది.