వీరమల్లు హీరోయిన్‌ ఐటెం సాంగ్‌తో సర్‌ప్రైజ్‌..!

పవన్‌ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే.;

Update: 2025-03-12 11:30 GMT

పవన్‌ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. వీరమల్లు సినిమా షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది. సినిమాను ఈ నెల చివర్లో విడుదల చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. మే నెలలో సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న 'రాజాసాబ్‌' సినిమాలోనూ నిధి అగర్వాల్‌ ఒక హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోంది. దాంతో నిధి అగర్వాల్‌ నటించిన రెండు పెద్ద సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉండటంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రెండు పెద్ద సినిమాల్లో నటిస్తున్న కారణంగా ఆ సినిమాల తర్వాత కొత్త సినిమాలు చేయాలని నిధి అగర్వాల్‌ భావిస్తుందట. అందుకే వచ్చిన చిన్నా చితకా ఆఫర్లను సున్నితంగా నిధి తిరస్కరిస్తుందని వార్తలు వస్తున్నాయి. సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలను వద్దు అంటున్న నిధి అగర్వాల్‌ ఇటీవల ఒక సీనియర్‌ స్టార్‌ హీరో సినిమాలో ఐటెం సాంగ్‌ను చేసేందుకు ఓకే చెప్పిందనే వార్తలు వస్తున్నాయి. ఆ సీనియర్‌ హీరో మరెవ్వరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ సన్నీ డియోల్‌. ఈ మధ్య కాలంలో సన్నీ డియోల్‌కి గదర్‌ 2 తో భారీ విజయం దక్కింది. అందుకే ఆయన నటిస్తున్న జాట్‌ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న విషయం తెల్సిందే.

తెలుగు దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న జాట్‌ సినిమాలో నిధి అగర్వాల్‌ ఐటెం సాంగ్‌ చేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. టాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మార్చి 17 నుంచి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో ప్రత్యేక పాట చిత్రీకరించబోతున్నారు. అందులో సన్నీ డియోల్‌తో పాటు నిధి అగర్వాల్‌ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు మాస్ ఎలిమెంట్స్‌ను జోడించేందుకు నిధి అగర్వాల్‌తో అందమైన ఐటెం సాంగ్‌ను గోపీచంద్‌ మలినేని ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

జాట్ సినిమాలో రెజీనా, సయామి ఖేర్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. మూడో హీరోయిన్‌గా ప్రత్యేక పాటలో నిధి అగర్వాల్‌ కనిపించబోతున్న నేపథ్యంలో సినిమాకు మరింత గ్లామర్ అద్దినట్లు కానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోపీచంద్‌ ఈ సినిమాకు తమన్‌తో సంగీతాన్ని చేయిస్తున్నాడు. ఐటెం సాంగ్ అంటే తమన్‌ ఓ రేంజ్‌లో పాటను ఇస్తాడనే నమ్మకం ఉంది. కనుక తప్పకుండా జాట్‌లో నిధి అగర్వాల్‌ చేయబోతున్న ఐటెం సాంగ్‌ చాలా స్పెషల్‌గా ఉంటుంది అనే విశ్వాసంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News