పిక్ టాక్‌ : సాంప్రదాయ చీర కట్టులో నిధి

ఏ ఔట్‌ ఫిట్‌ ధరించినా భలే అందంగా కనిపించే నిధి అగర్వాల్‌ తాజాగా సాంప్రదాయబద్దమైన చీర కట్టులో కనిపించి ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేసింది.

Update: 2024-12-10 10:53 GMT

నాగ చైతన్యతో కలిసి సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టిన నిధి అగర్వాల్‌ ఆ వెంటనే అఖిల్‌ సినిమా మిస్టర్ మజ్ను సినిమాలో నటించిన విషయం తెల్సిందే. బ్యాక్ టు బ్యాక్‌ అక్కినేని బ్రదర్స్‌తో నటించడంతో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ టాలీవుడ్‌లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా మాత్రం గుర్తింపు సొంతం చేసుకోలేక పోయింది. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచినా నిధి అగర్వాల్‌కి ఆఫర్లు మాత్రం కంటిన్యూ అవుతూ వచ్చాయి. మిస్టర్‌ మజ్ను తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఇస్మార్ట్‌ శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కింది.

 

రామ్‌ కి జోడీగా నటించిన ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సొంతం చేసుకోవడంతో టాలీవుడ్‌లో నిధి అగర్వాల్‌ బిజీ అయ్యింది. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ ఈమె నటించే అవకాశాలు సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోలేక పోయినా తాజాగా పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా హరి హర వీరమల్లు సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో ఈ అమ్మడు రాజకుమారి పాత్రలో కనిపించబోతుంది. ఆ విషయాన్ని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.

 

సినిమాలతో కాస్త తక్కువ కనిపించినా సోషల్‌ మీడియాలో ఈమె రెగ్యులర్‌గా సినిమాలు చేస్తూ కనిపిస్తూ ఉంది. అందంతో ఆకట్టుకోవడంతో పాటు తనకు ఉన్న ఆసక్తితో మోడలింగ్‌లోనూ రాణిస్తూ వస్తోంది. ఏ ఔట్‌ ఫిట్‌ ధరించినా భలే అందంగా కనిపించే నిధి అగర్వాల్‌ తాజాగా సాంప్రదాయబద్దమైన చీర కట్టులో కనిపించి ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేసింది. అందమైన పట్టు చీర కట్టులో నిధి అగర్వాల్‌ ఆకట్టుకుంది అంటూ అంతా కామెంట్స్ చేస్తున్నారు. అందంగా ఉన్న నిధి అగర్వాల్‌కి ఆశించిన స్థాయిలో ఆపర్లు రాకపోవడం విచారకరం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

పవన్‌ కళ్యాణ్‌ తో ప్రస్తుతం చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా విడుదల తర్వాత కచ్చితంగా నిధి అగర్వాల్‌కి మంచి క్రేజ్ దక్కడం ఖాయం. సినిమాల్లో ఇక నుంచి బిజీ బిజీగా ఈ అమ్మడు నటించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యంగ్‌ హీరోలు, యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఈమె డేట్ల కోసం ఎదురు చూసే రోజు వస్తుంది అంటూ ఇలాంటి ఫోటోలు షేర్‌ చేసినప్పుడు ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ముందు ముందు నిధి అగర్వాల్‌ ఇదే అందంతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తే కచ్చితంగా మరిన్ని సినిమాలు, అదీ కాకుండా ప్రముఖ స్టార్స్‌కి జోడీగా నటించే అవకాశాలు రావచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News