నిహారిక, నిగమ్ పెర్ఫెక్ట్ కెమిస్ట్రీ.. 'ఆహా' వీడియో చూశారా?

ఆహా ఓటీటీలో మద్రాస్కారణ్ మూవీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇప్పటికే ఆ విషయాన్ని ఆహా సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. కొత్త వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న వాగ్వాదం వాళ్ళ జీవితాలను మార్చే సంఘర్షణకు దారి తీసిందో చూడండంటూ ప్రకటించింది.

Update: 2025-02-26 06:28 GMT

మెగా డాటర్ నిహారిక.. అటు నటిగా.. ఇటు నిర్మాతగా బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. భర్తతో విడాకులు తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టిన ఆమె.. తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పై వెబ్ సిరీసులు, సినిమాలు నిర్మిస్తోంది. వాట్ ఏ ఫిష్ (తెలుగు)లో నటిస్తున్న నిహారిక.. రీసెంట్ గా మద్రాస్కారణ్(తమిళ్)తో సందడి చేసింది.

మాలీవుడ్ నటుడు షేన్ నిగమ్ హీరోగా యాక్ష‌న్ క‌థాంశంతో వాలి మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఆ సినిమా.. రివెంజ్ యాక్ష‌న్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొంగల్ కానుకగా జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవ్వగా.. ఫిబ్రవరి స్టార్టింగ్ లో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది.

ఆహా ఓటీటీలో మద్రాస్కారణ్ మూవీ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇప్పటికే ఆ విషయాన్ని ఆహా సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. కొత్త వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న వాగ్వాదం వాళ్ళ జీవితాలను మార్చే సంఘర్షణకు దారి తీసిందో చూడండంటూ ప్రకటించింది. కానీ ఆ సినిమాతో నిహారిక అనుకున్నంతగా హిట్ సాధించలేదు.

ఇప్పుడు తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆహా రీసెంట్ గా స్పెషల్ వీడియో ట్వీట్ చేసింది. సినిమాలో ఓ లవ్ చెడుగుడు.. సాంగ్ కు సంబంధించిన వీడియో బిట్ ను షేర్ చేసింది. అందులో షేన్ నిగమ్, నిహారిక తమ కెమిస్ట్రీతో ఓ రేంజ్ లో ఆకట్టుకుంటున్నారనే చెప్పాలి.

సాంగ్ కు తగ్గట్టు.. తమ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టెప్స్ తో అలరిస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిహారిక వేరే లెవెల్ లో ఉందని చెబుతున్నారు. అయితే ఆ పాట.. పాతికేళ్ల క్రితం వచ్చిన సఖి సినిమాలోని లవ్ చెడుగుడు సాంగ్ కు రీమేక్.

మద్రాస్కారణ్ స్టోరీ ఇలా..

సినిమాలో నిహారికకు హీరోతో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత పెళ్లి పనుల్లో ఉన్నప్పుడు హీరో ఓ యాక్సిడెంట్ చేయడం వల్ల క‌ళ్యాణి గాయ‌ప‌డుతుంది. దీంతో హీరోపై దురైసింగం పగ పెంచుకుంటాడు. ఆ తర్వాత అతడి కుటుంబంపై దాడి చేస్తాడు. మరి చివరకు ఏమైంది? హీరో తన ఫ్యామిలీ అని ఎలా కాపాడాడు? పెళ్లి ఎప్పుడు జరిగింది? వంటి ప్రశ్నలకు సమాధానాలు మద్రాస్కారణ్ సినిమా.

Tags:    

Similar News