ఆ విషయంలో రామ్ చరణ్ వరల్డ్ బెస్ట్ అంటున్న మెగా డాటర్..

మెగా ఫ్యామిలీలో ఏది జరిగిన అభిమానులకు అది పెద్ద వింటే అనడంలో ఎటువంటి డౌట్ లేదు

Update: 2024-08-01 09:17 GMT

మెగా ఫ్యామిలీలో ఏది జరిగిన అభిమానులకు అది పెద్ద వింటే అనడంలో ఎటువంటి డౌట్ లేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా అభిమానులు వెంటనే దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు. తాజాగా మెగా డాటర్ నిహారిక రామ్ చరణ్ ఆ విషయంలో వరల్డ్ బెస్ట్ అంటూ తెగ పోగిడేసింది. ప్రస్తుతం ఆమె మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతకీ నిహారిక చెర్రీ ని ఏ విషయంలో పొగిడిందో తెలుసుకుందాం పదండి..

మెగా డాటర్ నిహారిక.. హీరోయిన్ గా, నిర్మాతగా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని బాగా పాపులర్ అయింది. ఆమె నిర్మాణ సారధ్యంలో నిర్మించిన మొదటి చిత్రం ‘కమిటీ కుర్రాళ్లు’ ఆగస్టు 9న రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ చేస్తూ మెగా డాటర్ మెగా బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో నిహారిక తన అన్న రామ్ చరణ్ ,మెగా ప్రిన్సెస్ క్లీన్‌కారా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.

మెగా ప్రిన్సెస్ క్లీన్‌కారా ను ముద్దుగా నిహారిక కారా అని పిలుస్తారు అన్న విషయం ఈ ఇంటర్వ్యూలో అర్థమైంది. ఇక నిహారిక మాట్లాడుతూ ‘ కార మా ఇంట్లో అందరికీ ఓ గోల్డెన్ డార్లింగ్. కానీ పాపం మా చరణ్ అన్న ని మాత్రం తను చాలా టార్చర్ పెడుతుంది. మరి ముఖ్యంగా కారాకు భోజనం పెట్టడం ఓ పెద్ద టాస్క్. ఎత్తుకొని అన్ని చూపిస్తూ చరణ్ మెల్లగా తినిపిస్తాడు. నేను నా లైఫ్ లో ఇప్పటివరకు చూసిన ఫాదర్స్ అందరిలోకి మా అన్న ద బెస్ట్. స్టార్ హీరోగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ తన కూతురుతో కచ్చితంగా టైం స్పెండ్ చేస్తాడు. కూతురుతో ఉన్నప్పుడు మా అన్నని చూస్తే నిజంగా ఏ స్ట్రెస్ లేకుండా ఖాళీగా ఉన్నాడా అనిపిస్తుంది.’ అని అంది.

నిహారిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో పాటు చెర్రీ కి ఉన్న బిరుదుల్లో మరొక బిరుదు వచ్చి చేరిపోయింది. ఇప్పటివరకు రామ్ చరణ్ కి ఫిలిం ఇండస్ట్రీలో ఓ మంచి కొడుకుగా, మంచి హీరోగా, మంచి భర్తగా గుర్తింపు ఉంది. ఇప్పుడు ఈ అన్ని బిరుదులతో పాటు మంచి ఫాదర్ అనే బిరుదు కూడా యాడ్ అయిపోయింది. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Tags:    

Similar News