గేమ్‌ ఛేంజర్‌, విశ్వంభర హిట్‌.. నిహారిక అంచనా

'కమిటీ కుర్రోళ్లు' అనే విభిన్నమైన టైటిల్‌ తో యదు వంశీ దర్శకత్వంలో నిహారిక ఈ సినిమాను నిర్మించింది

Update: 2024-08-06 05:46 GMT

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నటిగా పలు సినిమాల్లో, సిరీస్ ల్లో నటించి మెప్పించింది. ఇప్పటి వరకు షార్ట్‌ ఫిల్మ్స్ మరియు వెబ్‌ సిరీస్ లను నిర్మించిన నిహారిక కొణిదెల మొదటి సారి ఒక సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

'కమిటీ కుర్రోళ్లు' అనే విభిన్నమైన టైటిల్‌ తో యదు వంశీ దర్శకత్వంలో నిహారిక ఈ సినిమాను నిర్మించింది. దాదాపు 15 మంది కొత్త వారితో ఈ సినిమాను నిర్మించినట్లుగా ఆమె తెలియజేశారు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో పాటు ఈతరం కుర్రాళ్ల అభిరుచికి అనుగుణంగా ఈ సినిమా ఉంటుంది అంటూ మేకర్స్‌ ప్రమోషన్ సందర్భంగా చెప్పుకొచ్చారు.

తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వరుణ్ తేజ్, సాయి ధరమ్‌ తేజ్ మరియు అడవి శేష్‌ లు ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. ఈ ఏడాది మా మెగా ఫ్యామిలీకి అంతా బాగా జరుగుతుంది. తప్పకుండా అన్ని అనుకూల అంశాలు మా సినిమాకు కూడా ఉండి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను నిహారిక వ్యక్తం చేసింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో నిహారిక మాట్లాడుతూ.... అన్నయ్య వరుణ్ తేజ్ ప్రతి విషయంలో నాకు సపోర్ట్‌ చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనసున్న మా బావ సాయి ధరమ్‌ తేజ్ ఈ ప్రీ రిలీజ్ వేడుక కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాతో 15 మందిని కొత్త వారిని పరిచయం చేయడం చాలా సంతృప్తిని ఇచ్చింది.

మా సినిమాలో సాయి కుమార్ గారి పాత్ర చాలా స్పెషల్‌ గా ఉంటుంది. ఆయన ఈ సినిమాలో నటించడం వల్ల మా సినిమా స్థాయి పెరిగింది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఇది అతి విశ్వాసం అయితే కాదు. మా కుటుంబంకు ఈ ఏడాది అన్ని విధాలుగా చాలా బాగుంది. కనుక ఈ సినిమా హిట్‌ అవ్వడం ఖాయం.

చరణ్ అన్న సినిమా ఆస్కార్‌ దక్కంచుకుంది, పెద్దనాన్న కి పద్మ విభూషన్‌ వచ్చింది, బాబాయి పవన్‌ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. నేను నిర్మాతగా ఈ ఏడాది మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. కనుక ఈ ఏడాది కచ్చితంగా హిట్ దక్కుతుంది.

రాబోయే రోజుల్లో కూడా మెగా ఫ్యామిలీ కి అంతా మంచే జరుగుతుందని నిహారిక అభిప్రాయం వ్యక్తం చేసింది. దాంతో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ మరియు చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలు కూడా హిట్ అవుతాయి అనే నమ్మకంతో మెగా ఫ్యాన్స్ ఉన్నారు. నిహారిక మాటలు, ఆమె అంచనాతో చరణ్‌, చిరు సినిమాలు కూడా హిట్‌ అవ్వడం ఖాయం అని మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నిహారిక సినిమాల విషయానికి వస్తే గతంలో నటిగా పలు సినిమాలు చేసింది. ఇప్పుడు మేకింగ్‌ పై శ్రద్ద పెట్టింది. కొత్త వారితో విభిన్నమైన కాన్సెప్ట్‌ తో మంచి సినిమాను నిహారిక ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమా మంచి ఫలితం దక్కించుకుంటే నిహారిక నుంచి ముందు ముందు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అన్న ల సినిమాలను కూడా నిహారిక నిర్మిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News