నిహారిక మళ్లీ పెళ్లి? ఆమె రెస్పాన్స్ ఏంటంటే?
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. యాంకర్ గా.. యాక్ట్రెస్ గా.. నిర్మాతగా టాలీవుడ్ లో పాపులర్ అయింది. తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని సత్తా చాటుతోంది. ఇప్పుడు నిర్మాతగా ఫస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. కమిటీ కుర్రోళ్ళు మూవీ నిర్మించింది. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.
అయితే నిహారిక పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. కానీ కొన్నాళ్లకే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంది. విడాకుల తర్వాత కాస్త సైలెంట్ అయిన మెగా డాటర్.. ఇప్పుడు మళ్లీ వర్క్ పై ఫోకస్ చేసి దూసుకుపోతోంది. నటనతోపాటు సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మాణంలో బిజీగా ఉంటోంది. వాట్ ద ఫిష్ మూవీలో అష్టలక్ష్మి అనే పాత్ర పోషిస్తోంది. దీంతోపాటు తమిళ చిత్రంలో కూడా యాక్ట్ చేస్తోంది.
ఇప్పుడు కమిటీ కుర్రోళ్ళు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో విడాకులు, మళ్లీ ప్రేమ, పెళ్లిలాంటి అంశాలపై స్పందించింది నిహారిక. విడాకుల తర్వాత లైఫ్ మెరుగ్గానే ఉందా అని అడగ్గా.. ప్రస్తుతం తాను వర్క్ పై ఫుల్ ఫోకస్ చేసినట్లు తెలిపింది. యాక్టింగ్ తో పాటు ప్రొడక్షన్ పై తన దృష్టి అంతా ఉందని చెప్పింది. మళ్లీ ప్రేమ లేదా పెళ్లి కోసం అడగ్గా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తాను హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పింది నిహారిక. అది సింగిల్ గానా లేక ఎవరితో కమిట్ అయ్యాక అనేది సమయమే నిర్ణయిస్తుందని తెలిపింది. తాను దేనికోసం కూడా వెతికి మరీ వెళ్లనని పేర్కొంది. ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుందని వెల్లడించింది. అయితే పేరెంట్స్ తనకు ఆ విషయంలో గౌరవిస్తారని తెలిపింది. స్వేచ్ఛ కూడా ఇచ్చారని అనింది. తల్లిదండ్రులు నాపై ప్రెషర్ పెట్టరని తెలిపింది. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఇంతకుముందు కూడా నిహారిక ఓ పాడ్ కాస్ట్ లో విడాకుల అంశంపై స్పందించింది. విడాకుల విషయంలో చాలా బాధపడ్డానని తెలిపింది. ఆ బాధ తనకు మాత్రమే తెలుసని చెప్పింది. తనపై తానే దృష్టి సారించే స్టేజ్ లో ఉన్నానని పేర్కొంది. పేరెంట్స్ కు సపోర్ట్ గా ఉండాలనుకుంటునట్లు చెప్పింది. విడాకుల తర్వాత ఎంతో ఏడ్చానని తెలిపింది నిహారిక. ఇప్పటికైతే నేను సింగిలేనని క్లారిటీ ఇచ్చింది.