మూడు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసింది

చివరకు ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమాను ప్రమోట్‌ చేశారు.

Update: 2024-11-27 04:06 GMT

కార్తికేయ 2, 18 పేజెస్‌, స్పై సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్‌ హీరో నిఖిల్‌ ఇటీవల 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో వచ్చారు. ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు విడుదల అయింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే జనాల్లో ఆసక్తి కనిపించలేదు. మేకర్స్ సైతం సినిమా తీశాం కనుక విడుదల చేయాలి అన్నట్లుగా ప్రచారం చేశారు అనిపించింది. హీరో ఈ సినిమా రిలీజ్‌కి మొదట ఒప్పుకోలేదు అనే వార్తలు వచ్చాయి. చివరకు ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమాను ప్రమోట్‌ చేశారు.

నవంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోయింది. నిఖిల్‌ గత చిత్రాలు మంచి ఫలితాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఒక మోస్తరు ఓపెనింగ్స్ ఈ సినిమాకు దక్కినా లాంగ్‌రన్‌లో అంతా భావించినట్లుగానే సినిమాకు డిజాస్టర్ వసూళ్లు నమోదు అయ్యాయి. నిఖిల్‌ ఇలాంటి సినిమా ఎలా చేశారు అంటూ ఆయన ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. సుధీర్‌ వర్మ పలు మంచి సినిమాలు తీసిన దర్శకుడు.. ఆయన ఇలాంటి సినిమా ఎలా తీశాడు అంటూ కొందరు ట్రోల్స్ చేశారు. మొత్తానికి సినిమా థియేటర్‌ రన్‌ రెండు వారాలు కూడా సాగలేదు.

ఈ మధ్య కాలంలో సినిమాలు థియేటర్‌ రిలీజ్ తర్వాత కనీసం నాలుగు వారాలకు ఓటీటీ ద్వారా వస్తున్నాయి. కానీ ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో మూడు వారాలు ముగియకుండానే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు అర్థరాత్రి నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతూనే ఉంది. థియేటర్‌ల ద్వారా చూడని కొన్ని సినిమాలను ప్రేక్షకులు ఓటీటీ ద్వారా చూస్తున్నారు. థియేటర్‌ రిలీజ్ ఫ్లాప్‌ అయిన సినిమాలు ఓటీటీలో హిట్‌ సాధించిన దాఖలాలు ఉన్నాయి. అందుకే ఈ సినిమా ఓటీటీ లో హిట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

నిఖిల్‌కు జోడీగా ఈ సినిమాలో సప్త సాగరాలు దాటి ఫేం రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటించింది. వచ్చే ఏడాదిలో నిఖిల్‌ ప్రస్తుతం నటిస్తున్న స్వయంభూ సినిమాతో పాటు ది ఇండియన్‌ హౌస్ సినిమా సైతం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రెండు సినిమాలు భారీ బడ్జెట్‌తో ప్రముఖ టెక్నీషియన్స్‌తో రూపొందుతోంది. కనుక ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయి. నిఖిల్‌ తన కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. కనుక స్వయంభూ సినిమా వంద కోట్ల సినిమా అంటూ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు రెడీ చేస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌ లో ఆ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News