ఆ పాన్ ఇండియాకి రిలీజ్ ముహూర్తం!

`కార్తికేయ‌2` తో నిఖిల్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాదిన `కార్తికేయ‌2 `క‌నెక్ట్ అవ్వ‌డంతో భారీ వ‌సూళ్లు సాధించింది.

Update: 2025-02-13 14:30 GMT

`కార్తికేయ‌2` తో నిఖిల్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఉత్త‌రాదిన `కార్తికేయ‌2 `క‌నెక్ట్ అవ్వ‌డంతో భారీ వ‌సూళ్లు సాధించింది. దీంతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా అవ‌త‌రించాడు. అయితే ఆ త‌ర్వాత చేసిన చిత్రాలేవి క‌నెక్ట్ అవ్వ‌లేదు. అవ‌న్నీ రీజ‌నల్ గానే రిలీజ్ అయ్యాయి. కానీ `స్వ‌యంభూ` ప్ర‌క‌ట‌న‌తో ఒక్క‌సారిగా నిఖిల్ వైపు అంద‌ర్ని తిప్పుకున్నాడు. ఇది చోళ సామ్రాజ్యానికి సంబంధించిన క‌థ కావ‌డంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియాలో తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం నిఖిల్ క‌త్తియుద్దం , గుర్ర‌పుస్వారీ పై ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకుని మ‌రీ రంగంలోకి దిగాడు. ఏడాది కాలంగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. చిన్న‌పాటి ప్యాచ్ వ‌ర్క్ లు మిన‌హా షూట్ పూర్త‌యింద‌ని స‌మాచారం. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటుంది. విజువ‌ల్ గా హైలై్ట అవ్వాల్సిన సినిమా కావ‌డంతో సీజీ వ‌ర్క్ ఎక్కువ‌గా ఉంది.

భారీ వార్ స‌న్నివేశాలున్నాయి. అందుకోసం విదేశీ టెక్నాల‌జీని వాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ మొత్తం పూర్త‌వ్వ‌డానికే రెండు నెల‌లుకు పైగా స‌మ‌యం ప‌డుతుంద‌ని స‌మాచారం. అన్ని ప‌నులు పూర్తి చేసి జూన్ లో సినిమాని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. అంటే ఇంకా మూడు నెల‌లకు పైగా స‌మయం ఉంది. ఈ లోగా ప్యాచ్ వ‌ర్క్ తో పాటు, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పూర్త‌వ్వాలి. అటుపై సెన్సార్ ముందుకెళ్లాలి.

అక్క‌డ అభ్యంత‌రాలు ఏమైనా వ్య‌క్తం అయితే? మ‌ళ్లీ ఎడిట్ చేయాల్సి ఉంటుంది. మ‌రి ఇవ‌న్నీ ముగించుకుని జూన్ క‌ల్లా ప్రేక్ష‌కుల ముందుకొస్తారా? రారా ? అన్న‌ది చూడాలి. ఇప్ప‌టికే ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద‌ర‌గొడుతుంది. ఓవ‌ర్సీస్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మ‌డు పోయిన‌ట్లు తెలుస్తోంది. `కార్తికేయ 2` స‌క్సెస్ నేప‌థ్యంలో స్వయంభు కు ఇంత డిమాండ్ ఏర్ప‌డింది.

Tags:    

Similar News