రియల్ హీరో అనిపించిన నిఖిల్!
యంగ్ హీరో నిఖిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'కార్తికేయ-2' తో పాన్ ఇండియాలోనే గుర్తింపు దక్కించుకున్నాడు
యంగ్ హీరో నిఖిల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'కార్తికేయ-2' తో పాన్ ఇండియాలోనే గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ తర్వాత పాన్ ఇండియాలో నిఖిల్ పేరు వినిపించడం విశేషం. ప్రస్తుతం 'స్వయంభూ' అనే పిరియాడిక్ చిత్రం ఒకటి చేస్తున్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రమే. రిలీజ్ అనంతరం హిట్ అయితే నిఖిల్ కెరీర్ కి తిరుగుండదు. అదే కాన్పిడెన్స్ తో ముందుకెళ్తున్నాడు. తాజాగా నిఖిల్ తాను తెరపైనే కాదు తెర వెనుక కూడా రియల్ హీరో అని ప్రూవ్ చేసాడు.
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో కొన్ని సంవత్సరాలుగా ఓ ఆలయం మూసి ఉంది. ఆలయం ఎదుకు మూతవేసారు అన్నది తెలియదు. చాలా కాలంగా తలుపులు మూసేసి పాడు బడినట్లు ఉంది. అయితే ఇదే ఆలయాన్ని నిఖిల్ తిరిగి తెరిపించాడు. దీంతో ఆ గ్రామస్థులు ఆదరాభిమానాలు కురిపిస్తున్నారు. ఆలయాన్ని తిరిగి తెరిపించేందుకు వచ్చిన నిఖిల్ను పూలపై నడిపించి ఆహ్వానించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను పంచుకున్న నిఖిల్' మీకు సేవ చేసే భాగ్యాన్ని తన కుటుంబానికి కల్పించా రంటూ ఆనందం వ్యక్తంచేశారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చాడు. గతంలో నిఖిల్ టెంపుల్ బ్యాక్ డ్రాప్ లోనే 'కార్తికేయ' అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అందులోనూ మూసేసిన గుడిలోకి అక్రమంగా చొరబడి గుడి రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.
ఆ గుడి ఎందుకు మూసేసారు? దాని వెనుక కారణాలు ఏంటి? అని ఆరా తీసిన సినిమా అది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్ గానే కార్తికేయ-2 పాన్ ఇండియాలో తెరకెక్కి దుమ్ముదులిపేసింది. దీంతో ఇప్పుడు కార్తికేయ-3కి కూడా రెడీ అవుతున్నారు. ఇది పాన్ ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ గా పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.