నితిన్ లైనప్.. ఫ్యాన్స్ ఖుషి..!

సీనియారిటీ ఎక్కువ ఉన్నా యువ హీరోలతో పోటీ పడుతుంటాడు లవర్ బోయ్ నితిన్. కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తుంటాడు;

Update: 2025-02-28 03:00 GMT

సీనియారిటీ ఎక్కువ ఉన్నా యువ హీరోలతో పోటీ పడుతుంటాడు లవర్ బోయ్ నితిన్. కెరీర్ లో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వెళ్తుంటాడు. ఐతే నితిన్ సినిమా సక్సెస్ కొడితే సంతోషించే ఫ్యాన్స్ ఉన్నారు. తనదైన ప్రత్యేక శైలిలో సినిమాలు చేస్తూ నితిన్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

మరోపక్క ఈ సినిమాతో పాటు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా కూడా చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నితిన్ కెరీర్ లో మంచి ఎమోషనల్ సినిమా అవుతుందని అంటున్నారు. నితిన్ తమ్ముడు నుంచి రిలీజ్ అవుతున్న పోస్టర్స్ తోనే బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ రెండు సినిమాల తర్వాత బలగం వేణుతో నితిన్ ఎల్లమ్మ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా దిల్ రాజు నిర్మిస్తున్న ప్రాజెక్టే.

అసలైతే వేణు ఎల్లమ్మ సినిమాలో హీరోగా నానిని అనుకున్నారు. కానీ నాని అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనే ఆలోచనతో నితిన్ తో చేస్తున్నారు. నితిన్ కు ఈ సినిమా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుందని అంటున్నారు. ఎల్లమ్మ కథగా ఉన్నప్పుడే సినిమా మాత్రం మరో సూపర్ హిట్ సినిమా అవుతుందని అనిపించేలా టాక్ వస్తుంది. ఈ మూడు సినిమాల లైనప్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.

నితిన్ రాబిన్ హుడ్ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్ గా వస్తుండగా తమ్ముడు సినిమా సిస్టర్ సెంటిమెంట్ ఎమోషనల్ మూవీగా వస్తుంది. ఇక ఎల్లమ్మ ఈ రెండిటినీ మించి ఉండబోతుందని తెలుస్తుంది. సో ఈ సినిమాల లిస్ట్ చూస్తుంటే వీటితో నితిన్ కూడా స్టార్ లీగ్ లోకి వెళ్లే ఛాన్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. జయం నుంచి తన ప్రతి సినిమాలో తన బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్న నితిన్ ఇక మీదట కెరీర్ మీద చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మరి నితిన్ ఈ సినిమాలతో ఏం చేస్తాడన్నది చూడాలి. నితిన్ ని ఇష్టపడుతున్న ఆడియన్స్ కూడా అతని సినిమాల లిస్ట్ తో సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి ఇంత మంచి లైనప్ తో నితిన్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News