నితిన్ కి ఫెయిల్యూర్స్ కొత్త కాదు

చివరగా 2020లో భీష్మ సినిమాతో బిగ్ సక్సెస్ చూసిన నితిన్ మళ్ళీ ఆ తరువాత వరుసగా థియేట్రికల్ డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నాడు.;

Update: 2025-04-01 08:30 GMT
నితిన్ కి ఫెయిల్యూర్స్ కొత్త కాదు

టాలీవుడ్‌లో కొన్ని పేర్లు ఫెయిల్యూర్‌కు కూడా సక్సెస్‌లా నిలబడతాయి. అలాంటి వారిలో నితిన్‌ ఒకరు. ఇటీవల విడుదలైన రాబిన్ హుడ్ చిత్రం కోసం నితిన్, చిత్రబృందం చేపట్టిన ప్రమోషన్స్‌ను చూస్తేనే వారి కమిట్‌మెంట్ అర్థమవుతుంది. ఆస్ట్రేలియన్ స్టార్ డేవిడ్ వార్నర్‌ను ప్రమోషన్‌లో భాగంగా తీసుకురావడం వంటి ట్రిక్స్ ఉపయోగించినా, చివరికి కంటెంట్ పటిష్టంగా లేకపోవడం వల్ల సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.

చివరగా 2020లో భీష్మ సినిమాతో బిగ్ సక్సెస్ చూసిన నితిన్ మళ్ళీ ఆ తరువాత వరుసగా థియేట్రికల్ డిజాస్టర్స్ ను ఎదుర్కొన్నాడు. ఇక మళ్ళీ ఫామ్ లోకి రావాలని భీష్మ దర్శకుడితోనే కలిసి వర్క్ చేసి రాబిన్ హుడ్ తో హిట్ కొట్టాలని చూశాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఇక నితిన్ కెరీర్‌పై ఓ లుక్కేస్తే, అపజయాలు అతనికి కొత్త కాదనే విషయం స్పష్టమవుతుంది.

ఓ సమయంలో ‘ఇష్క్’ సినిమా వర్కవుట్ కాకపోతే సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిందే అనుకున్న స్థితిలో ఉన్న నితిన్, అదే చిత్రం హిట్టవడంతో మళ్లీ స్పీడ్ పెంచాడు. తరువాత , బీష్మా లాంటి హిట్స్‌తో మళ్లీ తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. మధ్యలో వచ్చిన మాచర్ల నియోజకవర్గం, చెక్, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ లాంటి ఫ్లాప్స్ ఎదురైనా కూడా అతని క్రేజ్‌ను తగ్గించలేకపోయాయి.

ఇక్కడే నితిన్‌కు మిగతా టైర్ 2 హీరోల కంటే ఉన్న ప్రత్యేకత స్పష్టమవుతుంది. అతనికి ఓపెనింగ్స్ వస్తాయి. రాబిన్ హుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ తక్కువగా ఉన్నప్పటికీ, మొదటి రోజు ఆక్యుపెన్సీ చూస్తే డీసెంట్ గా ఉంది. అది నితిన్ స్టార్డమ్‌కు నిదర్శనం. అంతే కాకుండా మార్కెట్ లో థియేట్రికల్ బిజినెస్ ఎప్పుడు కూడా డౌన్ అవ్వలేదు. ప్రతీసారి తన క్రేజ్ తో సినిమాకు డిమాండ్ తీసుకు వస్తున్నాడు.

నితిన్‌కు ఫ్లాప్స్ తర్వాత కూడా బిజినెస్ పరంగా ఓ స్థిరమైన మార్కెట్ ఉంది. దానికి కారణం అతను రెగ్యులర్‌గా ట్రై చేస్తున్న కొత్త జానర్లు, మాస్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే కథలు. మరోవైపు, నితిన్‌తో పాటు నాని, విజయ్ దేవరకొండ లాంటి హీరోలు కూడా ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొంటున్నారు. కానీ వీరిలో మార్కెట్ మెయింటెన్ చేస్తూ, సినిమా తేడా కొట్టినా నిర్మాతలు నమ్మే హీరో నితిన్. విజయ్ దేవరకొండకు ఫ్లాప్స్ తర్వాత డౌట్స్ రావడం, నానికి మాస్ రేంజ్ పెద్దగా లేదన్న టాక్ వస్తుండగా, నితిన్ మాత్రం ఒకే ఒక్క హిట్‌తో మళ్లీ 20 కోట్ల బిజినెస్ మాట్లాడే స్థాయిలో ఉంటాడు.

ప్రస్తుతం నితిన్ తమ్ముడు అనే సినిమాతో వస్తున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో, దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా కావడంతో పాటు, మాస్ ఎలిమెంట్స్‌తోనూ ఉండబోతోంది. ఇందులో నితిన్ చేయబోయే పాత్ర, పవర్‌ఫుల్‌గా ఉండబోతుందన్న అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయితే, నితిన్ కెరీర్ మళ్లీ కొత్త దశలోకి వెళ్తుంది. ఇక, నితిన్ బౌన్స్ బ్యాక్ చేయడం పెద్ద విషయం కాదు. మరోసారి నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు హోప్స్ కలిగించేందుకు ఒక్క హిట్ సినిమా అతనికి చాలు. ఒక మిడిల్ టైర్ హీరోగా కాకుండా, మార్కెట్ పరంగా మెయిన్ స్ట్రీమ్ హీరోగా నిలబడగల హీరో నితిన్. మరి రానున్న రోజుల్లో అతను ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News