నితిన్ సినిమాలకు బడ్జెట్ సమస్య?

జయం, దిల్, సై లాంటి వరుస హిట్లతో ఘనంగా కెరీర్ ఆరంభమయ్యాక.. నితిన్ వరుస ఫ్లాపులతో ఎలా సతమతం అయ్యాడో తెలిసిందే.;

Update: 2025-04-05 02:30 GMT
నితిన్ సినిమాలకు బడ్జెట్ సమస్య?

జయం, దిల్, సై లాంటి వరుస హిట్లతో ఘనంగా కెరీర్ ఆరంభమయ్యాక.. నితిన్ వరుస ఫ్లాపులతో ఎలా సతమతం అయ్యాడో తెలిసిందే. ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ గాడిన పడే వరకు పేలవమైన దశను అనుభవించాడతను. ‘ఇష్క్’ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌‌లోనూ అప్పుడప్పుడూ కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా.. కెరీర్ నాట్ బ్యాడ్ అన్నట్లే సాగుతూ వచ్చింది. గుండె జారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ లాంటి మంచి హిట్లు పడ్డాయి. మధ్య మధ్యలో కొన్ని సినిమాలు తేడా కొట్టినా నితిన్ బాగానే నిలదొక్కుకున్నట్లే కనిపించాడు.

కానీ ఈ మధ్య మళ్లీ నితిన్ వరుస ఫెయిల్యూర్లు చూస్తున్నాడు. చెక్, రంగ్ దె, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్.. ఇలా వరుసగా నాలుగు ఫెయిల్యూర్లు ఎదుర్కొన్నాడు. ఈ స్థితిలో తన ఆశలన్నీ ‘రాబిన్ హుడ్’ మీదే నిలిచాయి. కానీ ఈ సినిమా కూడా నిలబడలేదు. నితిన్ ఖాతాలో మరో డిజాస్టర్ జమ అయింది.

ఇప్పటిదాకా ఫెయిల్యూర్లు వస్తున్నా నితిన్ మీద నమ్మకంతో నిర్మాతలు బాగానే ఖర్చు పెడుతూ వచ్చారు. మైత్రీ వాళ్లయితే ‘రాబిన్ హుడ్’ మీద ఏకంగా రూ.70 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టేశారు. కానీ ఈ చిత్రం దారుణమైన నష్లాలను మిగిల్చింది. నితిన్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపింది. దీంతో తర్వాతి చిత్రాల బడ్జెట్లను నిర్మాతలు సరి చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆల్రెడీ దిల్ రాజు.. ‘తమ్ముడు’ మీద కొంచెం ఎక్కువ బడ్జెటే పెట్టాడు. ‘రాబిన్ హుడ్’ ఎఫెక్ట్‌తో అందుకు తగ్గట్లుగా బిజినెస్ జరగడం కష్టంగా మారింది.

దీంతో నితిన్‌తోనే తర్వాత తీయాల్సిన ‘యల్లమ్మ’ సినిమాకు బడ్జెట్ విషయంలో తర్జన భర్జనలు నడుస్తున్నట్లు సమాచారం. షెడ్యూళ్లు, ఖర్చును రివైజ్ చేస్తున్నారట. ఇంకోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్‌లో నితిన్ ఓ భారీ బడ్జెట్ సినిమా చేయాల్సి ఉంది. అది పెద్ద స్పాన్ ఉన్న సినిమా. ఐతే ఆల్రెడీ ‘విశ్వంభర’తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న యువి వాళ్లు.. నితిన్ సినిమా విషయంలో పెద్ద రిస్క్ చేసే స్థితిలో లేరు. దీంతో ఆ సినిమా అసలు ముందుకు కదులుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ‘రాబిన్ హుడ్’ డిజాస్టర్ కావడంతో నితిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద బాగానే ప్రభావం చూపేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News