యూత్ స్టార్ ని సూరి లైన్ లోకి తెస్తున్నాడా?
యూత్ స్టార్ నితిన్ వరుస ప్లాప్ ల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏకంగా ప్లాప్ ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసాడు.;

యూత్ స్టార్ నితిన్ వరుస ప్లాప్ ల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏకంగా ప్లాప్ ల్లో డబుల్ హ్యాట్రిక్ నమోదు చేసాడు. ఇటీవల రిలీజ్ అయిన `రాబిన్ హుడ్` కూడా తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా కంబ్యాక్ అవ్వాలనుకున్నాడు. కానీ పనవ్వలేదు. ప్రస్తుతం నితిన్ చేతిలో ఉన్నది ఒకే ఒక్క చిత్రం. అదే `తమ్ముడు`. పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ తో వేణు శ్రీరామ్ తెర కెక్కిస్తోన్న చిత్రమిది.
ప్రస్తుతానికి ఆశలన్నీ ఈ సినిమాపైనే. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. షూటింగ్ ఏ దశలో ఉంది అన్నది క్లారిటీ లేదు. `రాబిన్ హుడ్` ప్లాప్ నుంచి నితిన్ కొలుకునే పనిలో ఉన్నాడు. అనం తరం మళ్లీ తమ్ముడు రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అయితే ఈ సినిమా సెట్స్ లో ఉండగానే నితిన్ కొత్త సినిమా లాక్ చేసే పనిలో ఉన్నట్లు తెలిసింది. దీనిలో భాగంగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డిని రంగంలోకి దింపుతున్నాడుట.
ఇటీవలే సూరి-నితిమన్ మధ్య సమావేశం జరిగిందని సన్నిహితుల సమాచారం. సూరి స్టోరీ లైన్ వినిపించినట్లు నచ్చడంతో నితిన్ కూడా ఒకే చేసినట్లు వినిపిస్తోంది. `ఏజెంట్` ప్లాప్ తర్వాత సురేందర్ రెడ్డి ఎక్కడా కనిపించని సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ప్లాప్ అవ్వ డంతో సూరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇంత వరకూ కొత్త సినిమా కబురు ఎక్కడా చెప్పలేదు.
దీంతో `ఏజెంట్` ప్లాప్ తో సూరి ఎంతగా నిరుత్సాహానికి గురయ్యాడు? అన్నది అర్దమైంది. అఖిల్ కి భారీ హిట్ ఇద్దామనుకుంటే? ఇంకేదో జరిగిపోయింది. అప్పటి నుంచి సూరి బయట కనిపించలేదు. తాజాగా నితిన్ అతడిని మళ్లీ బయటకు తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంత వరకూ ఇద్దరు కలిసి సినిమాలు చేయని సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు సక్సెస్ అనే ఆకలి మీద జత కడుతున్నారు కాబట్టి కసిగా పని చేస్తారు.