యూత్ స్టార్ సేఫ్ గేమ్..నో రిస్క్!
విక్రమ్ .కె.కుమార్ తో మరో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు.
'భీష్మ' తర్వాత యూత్ స్టార్ నితిన్ కి వరుసగా ఐదు ప్లాప్ లు ఎదురయ్యాయి. మరో ప్లాప్ చిత్రం పడితే డబుల్ హ్యాట్రిక్ ప్లాపులు నమోదవుతాయి. ఆ ఛాన్స్ ఇవ్వకుండా నితిన్ ముందే జాగ్రత్త పడుతున్నాడు. తెలివిగా హిట్ ఇచ్చిన 'భీష్మ' దర్శకుడితో నే ఇప్పుడు 'రాబిన్ హుడ్' అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కూడా యధావిధిగా రష్మిక మందన్నానే హీరోయిన్ గా తీసుకున్నరు. అలా 'భీష్మ' కాంబినేషన్ రెండవ సారి రిపీట్ అవుతుంది.
ఈ చిత్రాన్ని చెక్కుతున్నట్లే కనిపిస్తోంది. సెట్స్ కి వెళ్లి కొన్నినెలలు అవుతుంది. కానీ ఇంతవరకూ పూర్తవ్వలేదు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాతో పాటే వేణు శ్రీరామ్ దర్శక త్వంలో 'తమ్ముడు' చిత్రంలో నటిస్తున్నాడు. ఇలా ఏకకాలంలో రెండు సినిమాలు చేస్తున్నాడు. దర్శకు లిద్దరు మంచి సక్సెస్ రేట్ ఉన్నవారు కావడంతో? ఆ చిత్రాలపై అంచనాలు బాగానే ఉన్నాయి.
హిట్ అందుకుంటాడనే పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ రెండు రిలీజ్ కాకుండానో మరో హిట్ డైరెక్టర్ ని నితిన్ రంగంలోకి దించుతున్నాడు. విక్రమ్ .కె.కుమార్ తో మరో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. 'హనుమాన్'తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ప్రైమ్ షో సంస్థ అధినేత నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
దీన్ని భారీ బడ్జెట్ చిత్రంగా ప్లాన్ చేస్తున్నారుట. నితిన్ కెరీర్ లో ఇదే తొలి భారీ బడ్జెట్ చిత్రమని అంటున్నారు. విక్రమ్. కె మార్క్ డిఫరెంట్ చిత్రమని సమాచారం. గతంలో ఇద్దరి కాంబినేషన్ లో 'ఇష్క్' తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ. కానీ ఈసారి లవ్ స్టోరీకి బధులు డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.