డిసెంబర్ 20 ఫైట్.. ఈ ఇద్దరికి హిట్టు కావాలి!
ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఈ ఏడాదిలో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.
టాలీవుడ్ లో టైర్ 2 హీరోలుగా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ బిల్డ్ చేసుకున్న నటులలో యంగ్ హీరో నితిన్, నాగ చైతన్య టాప్ లిస్టులో ఉంటారు. ఈ ఇద్దరు హీరోలలో ఎవరి టాలెంట్ వారిదే. కథల ఎంపికలో నితిన్ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కి ప్రాధాన్యత ఇస్తాడు. నాగ చైతన్య కొత్తకథలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ తనని తాను ఒక యాక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అనుకుంటాడు.
అయితే ఈ మధ్య కాలంలో ఈ ఇద్దరు హీరోలకి సక్సెస్ ల కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. అయిన కూడా వారు నమ్మిన దారిలోనే సినిమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చైతన్య అయితే ఎప్పటికప్పుడు తనని కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే మజిలీ, మనం లాంటి కథలలో చైతూ భాగం అయ్యాడు. అలాగే యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమాలు చేసాడు. మాస్ ఆడియన్స్ కి చేరువ చేసే యాక్షన్ బేస్డ్ సినిమాలు కూడా చైతూ చేశాడు.
ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఈ ఏడాదిలో ఒకే రోజు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. డిసెంబర్ 20న నితిన్ వెంకీ కుడుములతో కలిసి రాబిన్ హుడ్ మూవీ చేస్తున్నాడు. సినిమా షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నితిన్, వెంకీ కాంబోలో వస్తోన్న సెకండ్ మూవీ కావడంతో రాబిన్ హుడ్ పై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఈ మూవీ ఈ ఏడాది ఆఖరులో క్రిస్మస్ కి థియేటర్స్ లోకి రాబోతోంది.
నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నాడు. ఇది వరకే వీరు ప్రేమమ్ తో హిట్ అందుకున్నారు. ఇక తండేల్ సినిమా కూడా డిసెంబర్ 20న రాబోతోంది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రెడీ చేస్తోంది. సాయి పల్లవి ఈ మూవీలో చైతూకి జోడీగా నటిస్తోంది. ఇప్పటికే తండేల్ నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తిగా సిద్ధమవుతోన్న సినిమా కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హెవీగానే ఉన్నాయి.
మూవీ కోసం నాగ చైతన్య లుక్ తో పాటు స్లాంగ్ కూడా కంప్లీట్ గా చేంజ్ చేశాడు. ఉత్తరాంద్ర స్లాంగ్ ని నేర్చుకొని క్యారెక్టర్ కి జీవం పోసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ మూవీ దీపావళికి రిలీజ్ అవుతుందని ఎనౌన్స్ చేశారు. అయితే క్రిస్మస్ కి పోస్ట్ పోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య క్రిస్మస్ కి మంచి రసవత్తర పోరు ఉండే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. . రెండు సినిమాల మీద కూడా పబ్లిక్ కి పాజిటివ్ ఒపీనియన్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మెప్పిస్తుందనేది వేచి చూడాలి.