హిట్ కాంబో ఫిక్స్.. మొదలుపెట్టడమే లేటు!

ఒకప్పుడు ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టి, తనకు హిట్ ట్రాక్ ఎక్కించిన ఇష్క్ మూవీ డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్ తో వర్క్ చేయనున్నారని తెలుస్తోంది.

Update: 2024-07-04 06:17 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. కొన్ని నెలలుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో కెరీర్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న నితిన్.. ఇప్పటివరకు గట్టి హిట్ కొట్టలేకపోయారు. మ్యాస్ట్రో మూవీ మిక్స్ డ్ రెస్పాన్స్ రాబట్టగా.. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అందుకే తన తర్వాత మూవీల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు హీరో నితిన్. వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమ్ముడు సినిమాలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తుంటే.. సినిమా అన్ని ఎలిమెంట్స్ తో యూనిక్ గా రూపొందుతున్నట్లు ఈజీగా అర్థమవుతుంది.

అదే సమయంలో నితిన్.. తనకు భీష్మ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో కూడా వర్క్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమా చిత్రీకరణ సగానికిపైగా పూర్తైంది. ప్రస్తుతం రాబిన్ హుడ్ షూటింగ్.. హైదరాబాద్ శివార్లలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. డిసెంబర్ లో మూవీని రిలీజ్ చేయనున్నారని టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇప్పుడు నితిన్ మరో సినిమాను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టి, తనకు హిట్ ట్రాక్ ఎక్కించిన ఇష్క్ మూవీ డైరెక్టర్ విక్రమ్.కె.కుమార్ తో వర్క్ చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరి కాంబోలో సినిమా ఉన్నట్లు వార్తలు రాగా.. ఇప్పుడు మరోసారి చర్చ నడుస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే సినిమాను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.

Read more!

ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన నిర్మాత నిరంజన్ రెడ్డి.. విక్రమ్, నితిన్ ప్రాజెక్ట్ ను రూపొందించనున్నారని తెలుస్తోంది. హనుమాన్ తర్వాత నిరంజన్ రెడ్డితో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం విక్రమ్.. నితిన్ మూవీ స్క్రిప్ట్ ను ఫైనల్ చేస్తున్నారట. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా ఉంటుందని టాక్. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News

eac