ఇష్టం లేకపోయినా.. చేయక తప్పట్లేదు..!

ఐతే నచ్చిన పని.. మంచి పారితోషికం ఇవన్నీ ఉన్నా కూడా కొంతమందికి ఇది సంతృప్తి ఇవ్వదు.

Update: 2025-01-22 09:44 GMT

సెలబ్రిటీ హోదా వచ్చాక ఎంత డబ్బు.. ఎంత పేరు ప్రఖ్యాతలు వస్తాయో తెలిసిందే. ఐతే వీటితో పాటు ఎక్కడికైనా స్వేచ్చగా వెళ్లాలంటే మాత్రం కష్టమవుతుంది. సెలబ్రిటీస్ కనిపిస్తే చాలు వారి చుట్టూ వందలమంది గుమిగూడతారు. దాని వల్ల వారు ఎంతో అసౌకర్యంగా భావిస్తుంటారు. అందుకే ఈమద్య అందరు స్టార్స్ తమ చుట్టూ బాడీ గార్డ్స్ ని పెట్టుకుని తిరుగుతున్నారు. ఒకేసారి జనాలంతా మీద పడకుండా ఈ గార్డ్స్ హెల్ప్ చేస్తారు.

ఐతే నచ్చిన పని.. మంచి పారితోషికం ఇవన్నీ ఉన్నా కూడా కొంతమందికి ఇది సంతృప్తి ఇవ్వదు. ఈ లిస్ట్ లో మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మేనన్ చేరింది. సినిమాల్లో వచ్చి స్టార్ గా ఎదిగి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా మేనన్ ఛాన్స్ వస్తే సినిమాలు వదిలి ఏదైనా రంగంలోకి వెళ్తానని అంటుంది. తనకి నచ్చని రంగం సినిమా అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది నిత్యా మేనన్.

నిత్యా మేనన్ ఇలా ఫీల్ అవ్వడానికి కారణం లేకపోలేదు. సెలబ్రిటీ అనగానే తమ పని తాము సరిగా చేసుకోనివ్వకుండా అందరు అడ్డొస్తుంటారు. నిత్యాకు పైలెట్ అవ్వాలని ఉండేదట కానీ నటిని అయ్యానని.. నటిగా మారిన తర్వాత స్వేచ్చగా జీవించడం కూడా మర్చిపోవాల్సి వచ్చిందని అన్నది నిత్య మేనన్. సెలబ్రిటీలా కాకుండా కామన్ మ్యాన్ జీవితాన్ని ఇష్టపడతానని అంటుంది నిత్యా మేనన్. పార్కుల్లో వాకింగ్ ఇష్టం కానీ అది అసలు సాధ్యం కాదని అంటుంది.

ఇవన్నీ తలచుకుంటే ఇదంతా అవసరమా వదిలి వెళ్లాలని అనిపిస్తుంది. నేషనల్ అవార్డ్ రాకముందు వరకు సైలెంట్ గా ఎటైనా వెల్దామని అనిపించింది. కానీ జాతీయ అవార్డ్ రావడం వల్ల తన ప్రయత్నం మానుకున్నా అని చెప్పింది నిత్యా మేనన్. నిత్య కామెంట్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సహజ నటిగా తన మార్క్ చాటుతూ సౌత్ ఆడియన్స్ ని అలరిస్తున్న నిత్యా మేనన్ కెరీర్ మధ్యలో కాస్త మందకొడిగా సాగినా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది. తెలుగులో ఆమెకు సరిగా ఛాన్స్ లు రావట్లేదు కానీ కోలీవుడ్ లో మాత్రం వరుస ఆఫర్లతో అదరగొట్టేస్తుంది. రవి మోహన్ తో ఒక సినిమా చేస్తున్న నిత్యా మేనన్.. ధనుష్ డైరెక్ట్ చేస్తున్న ఇండ్లీ కడై సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.

Tags:    

Similar News