నితిన్ - సంక్రాంతికి రాకపోతే ఇంకెప్పుడు మరి?

మైత్రీ మూవీ మేకర్స్ సంక్రాంతికే స్కెచ్ వేసిందని గుసగుసలు వినిపించాయి. దీంతో రాబిన్ హుడ్ జనవరి 13న రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు.

Update: 2024-12-16 13:18 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరైన హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. త్వరలో రాబిన్ హుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నితిన్ కు ఇప్పటికే భీష్మ మూవీతో మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

హిట్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఆడియన్స్ లో రాబిన్ హుడ్ పై మంచి అంచనాలు నెలకొన్నాయి. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఆ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల క్రితం మేకర్స్ అనౌన్స్ చేశారు. అంతకుముందే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. గ్లింప్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై వేరే లెవెల్ పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.

రీసెంట్ గా సెకండ్ సింగిల్ ను విడుదల చేస్తామని చెప్పి మేకర్స్ వాయిదా వేశారు. అప్పటి నుంచి సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతుందన్న ప్రచారం మొదలైంది. క్రిస్మస్ కు కాకుండా.. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తారని టాక్ వినిపించింది. ఇప్పటికే పొంగల్ రేసులో మూడు సినిమాలు ఉండగా.. నాలుగో మూవీగా రిలీజ్ అవుతుందన్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ సంక్రాంతికే స్కెచ్ వేసిందని గుసగుసలు వినిపించాయి. దీంతో రాబిన్ హుడ్ జనవరి 13న రిలీజ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అది కూడా ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. ముందు సంక్రాంతి అనుకున్న మేకర్స్.. ఇప్పుడు శివరాత్రికి రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారట. నితిన్ కు ఆ విషయం చెప్పారట.

కానీ నితిన్.. అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. సంక్రాంతికి ఎలా అయినా సినిమాను రిలీజ్ చేయాలని పట్టుబట్టినట్లు సమాచారం. పొంగల్ కు విడుదల చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తాయని కనుక అప్పుడే విడుదల చేయాలని నిర్మాతలకు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదని టాక్ వినిపిస్తోంది. మరి ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News