నితీష్ `రామాయ‌ణం` కోసం ఆస్కార్ రేంజ్‌ VFX

కేజీఎఫ్ స్టార్ య‌ష్ ఓ వైపు నితీష్ తివారీ రామాయ‌ణంలో రావ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడని క‌థ‌నాలొచ్చాయి.

Update: 2024-04-12 07:37 GMT

కేజీఎఫ్ స్టార్ య‌ష్ ఓ వైపు నితీష్ తివారీ రామాయ‌ణంలో రావ‌ణుడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడని క‌థ‌నాలొచ్చాయి. ఇప్ప‌టికే నితీష్ రామాయ‌ణం సెట్స్ పై ఉంది. ఇంత‌లోనే ఇప్పుడు రాకింగ్ స్టార్ య‌ష్ స్వ‌యంగా రామాయ‌ణం నిర్మించేందుకు ముందుకు రావ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అత‌డు ప్ర‌ఖ్యాత‌ నమిత్ మల్హోత్రా నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ తో క‌లిసి రాకింగ్ స్టార్ యష్ మాన్ స్ట‌ర్ మైండ్ క్రియేషన్స్ లో రామాయణం ఇతిహాసాన్ని క‌చ్చితమైన వెర్షన్‌ను రూపొందించడానికి చేతులు కలప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. నిజానికి య‌ష్ తీసుకున్న ఈ నిర్ణ‌యం మాన్‌స్ట‌ర‌స్ అని భావించాల్సి ఉంటుంది. నితీష్ తివారీ-న‌మిత్ మ‌ల్హోత్రా- య‌ష్ క‌ల‌యిక‌లోని అద్భుత విజ‌న్ ఇద‌ని భావించాలి.

ప‌లుమార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్న విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ DNEG కి గ్లోబల్ CEO అయిన విజనరీ నిర్మాత నమిత్ మల్హోత్రా ఇప్పుడు పురాణేతిహాస క‌థ రామాయ‌ణంను పెద్ద తెరపైకి తీసుకురావడానికి నితీష్ తివారీ- య‌ష్ తో క‌లిసారు. ఆయ‌న చాలా సంవత్సరాలుగా తన ప్రణాళికలను అభివృద్ధి చేస్తున్నారు. గ్లోబల్ సూపర్‌స్టార్ యష్‌తో తన ఆశయాల గురించి చర్చించారు. ఎట్ట‌కేల‌కు నమిత్ ఆత్మబంధువును కనుగొన్నాడు. రెండు చిత్రనిర్మాణ పవర్‌హౌస్‌లు భారతదేశ ఇతిహాసం తాలూకా గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచవేదిక‌పైకి తీసుకురావాలనే నిర్ణ‌యంతో ఏక‌మ‌య్యారు.

ఈ త్ర‌యం ఒక గొప్ప ప్ర‌య‌త్నం ప్రారంభించార‌న‌డంలో సందేహం లేదు. దీనిపై నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ...``సంవత్సరాలుగా US, UK, భారతదేశంతో అనుసంధాన‌మైన సంస్థ మాది. ఈ ప‌దేళ్ల‌లో ఇతర కంపెనీల కంటే అసమానమైన వాణిజ్య విజయాలు, ఎక్కువ ఆస్కార్ విజయాలు సాధించిన ఘ‌న‌త‌ను వ‌హించిన సంస్థ ఇది. నా వ్యక్తిగత ప్రయాణం నన్ను ఈ రంగానికి నడిపించింది. రామాయణం లాంటి అద్భుతమైన కథకు న్యాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ప‌ని కోసం తగిన శ్రద్ధతో గౌరవంతో వ్యవహరిస్తాను. అయితే దీనితో కొన్ని స‌వాళ్లు ఉన్నాయి. ఒక కథ పవిత్రతను గౌరవించడం, ఆ క‌థ వింటూ పెరిగిన మనమంతా చాలా గొప్పగా భావించడం స‌వాళ్లు. ఈ కథను అంతర్జాతీయ ప్రేక్షకులు పెద్ద స్క్రీన్ అనుభవంగా స్వీకరిస్తారు``అని అన్నారు. యష్‌లో మన సంస్కృతిలోని ఉత్తమమైన క‌థ‌ల్ని ప్రపంచంతో పంచుకోవాలనే ఆకాంక్షను నేను గుర్తించాను. కర్నాటక నుండి K.G.F: చాప్టర్ 2 తో అంత‌ర్జాతీయంగా విజ‌యం అందుకున్నాడు. దీనితో మా వ‌ద్ద ఉన్న‌ కథలన్నింటిలోకెల్లా గొప్పదైన ప్రపంచవ్యాప్త ప్రభావాన్ని సృష్టించే రామాయ‌ణం కోసం సహాయపడే ఒక మంచి భాగస్వామిని య‌ష్‌లో వెతికాను. పాత్రలు - కథలకు ప్రాణం పోసే సామర్థ్యంతో యష్ భారతదేశం స‌హా అంతర్జాతీయంగా భారీ అభిమానులను సంపాదించి, ఒక చిహ్నంగా ఉద్భవించాడు. 2014 నుండి తన చిత్రాలన్నింటికీ సృజనాత్మక నిర్మాతగా యష్ కొత్తదనంతో కూడిన‌ అనుభవ సంపదను తీసుకువచ్చాడు. అతడు ప‌ని చేస్తున్న ప్రతి ప్రాజెక్ట్ లోతైన ప‌రిజ్ఞానంతో ప్రేక్షకులకు క‌నెక్ట‌వుతోంది`` అని అన్నారు.

యష్ మాట్లాడుతూ.. స‌``భారతీయ సినిమాను ప్రపంచ స్థాయిలో ప్రదర్శించే విధంగా సినిమాలు తీయాలనేది నా చిరకాల కోరిక. దాని కోసం నేను అత్యుత్తమ VFX స్టూడియోలలో ఒకదానితో పొత్తు పెట్టుకోవడానికి LAలో ఉన్నాను. దీని వెన‌క ప్ర‌ధాన‌ శక్తి తోటి భారతీయుడే కావడం నాకు ఆశ్చర్యం కలిగించింది. న‌మిత్ - నేను చాలా చ‌ర్చించాం. మేము వివిధ ప్రాజెక్టుల గురించి ఆలోచించాం. ఈ చర్చల సమయంలో రామాయణం ప్ర‌స్థావ‌న వచ్చింది. నమిత్ దీనికోసం ఇప్ప‌టికే ప‌ని చేస్తున్నాడు. రామాయణం ఒక సబ్జెక్ట్‌గా అనుకున్నాం. నితీష్ తో రామాయణంలో సహ-నిర్మాతలో చేర్చడం ద్వారా ఆయ స‌హ‌కారం అందుతోంది. మేమంతా క‌లిసి ప్ర‌పంచ వీక్ష‌కుల కోసం సినిమాను రూపొందిస్తున్నాం`` అని అన్నారు. నమిత్ మల్హోత్రా - యష్ -నితీష్ తివారీ కల‌యిక‌లో రామాయణం మరపురాని సినిమాటిక్ అనుభవంగా రూపొందుతోందని దీనిని బ‌ట్టి అర్థం చేసుకోవాలి.

ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ గురించి

నిర్మాత నమిత్ మల్హోత్రా నేతృత్వంలో, ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ అనేది వినూత్నమైన గ్లోబల్ కంటెంట్‌ను రూపొందించడానికి అంకితమైన స్వతంత్ర నిర్మాణ సంస్థ. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ ప్రస్తుతం మూడు భారీ సినిమాల‌ను సహ-నిర్మిస్తోంది. రాకింగ్ స్టార్ యష్ స్థాపించిన మాన్ స్ట‌ర్ మైండ్ క్రియేషన్స్ అనేది సృజనాత్మక ప్రతిభను పెంపొందించడానికి, అసాధారణమైన కంటెంట్‌ను ముందుకు తీసుకురావడానికి అంకితమైన స్వతంత్ర నిర్మాణ సంస్థ.

Tags:    

Similar News