దేవర మూవీ… అక్కడే ఫోకస్ చేయకపోతే ఎలా?
సినిమా రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఇప్పటి వరకు ఒక్క సాంగ్, టీజర్ తప్ప మూవీ నుంచి ఎలాంటి హైప్ క్రియేట్ చేసే అవుట్ ఫుట్ రాలేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి చివరిగా ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చింది. భారీ మల్టీ స్టారర్ చిత్రంగా వచ్చిన ఈ మూవీ తారక్ కి గ్లోబల్ లెవల్ లో మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. నటుడిగా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. కొమరం భీమ్ పాత్రకి ఎన్టీఆర్ ప్రాణం పోసాడనే మాట వినిపించింది. ఈ చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీతో థియేటర్స్ లోకి రాబోతున్నాడు.
కొరటాల శివ దర్శకత్వంలో రెడీ అవుతోన్న ఈ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా ఐదు భాషలలో రిలీజ్ అవ్వనుంది. మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తోంది. తారక్ దేవర మూవీపైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ కొడుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్న మూవీకి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ప్రమోషన్ లేదనే మాట వినిపిస్తోంది.
దేవర సినిమా నుంచి ఇప్పటి వరకు ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అనిరుద్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ పర్వాలేదనే టాక్ తెచ్చుకుంది. అనిరుద్ కూడా చాలా కసిగా ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. అయితే హిందీ ఇండస్ట్రీలో ఓపెనింగ్ కలెక్షన్స్ సాధించాలంటే సినిమాకి స్ట్రాంగ్ ప్రమోషన్ ఉండాలి. లేదంటే హిందీ మార్కెట్ ని ప్రభావితం చేసేంత ఇమేజ్ ఉండాలి. డార్లింగ్ ప్రభాస్ కి ఆ స్థాయిలో ఇమేజ్ ఉంది కాబట్టి అతని సినిమాల హిందీ వెర్షన్స్ కి ఫస్ట్ డే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా హిందీ వెర్షన్ మొదటి రోజు కేవలం 19 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ సినిమా తర్వాత తారక్ ఇమేజ్ పెరిగింది. అయితే అది ఎంత వరకు హిందీ మార్కెట్ ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుంది అనేది చెప్పలేని విషయం. హిందీలో వార్ 2 సినిమాలో తారక్ ఒక లీడ్ రోల్ చేస్తున్నారు. అది దేవర 2కి కలిసొచ్చే అవకాశం కొంత ఉంది. దేవర సినిమాకి హిందీ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ స్థాయిలో హైప్ లేదనే మాట వినిపిస్తోంది.
సినిమా రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయమే ఉంది. ఇప్పటి వరకు ఒక్క సాంగ్, టీజర్ తప్ప మూవీ నుంచి ఎలాంటి హైప్ క్రియేట్ చేసే అవుట్ ఫుట్ రాలేదు. ఈ నేపథ్యంలో దేవర మూవీ ఇంపాక్ట్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. ఎన్టీఆర్ దేవరతో కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటించారు. వీరిద్దరికి బాలీవుడ్ లో కొంత మార్కెట్ ఉంది. ఇది దేవర మూవీకి మొదటి మంచి ఓపెనింగ్స్ తీసుకొస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.