పూజాహెగ్డేకి పోటీ గా బాహుబలి అందం!
రాఘవ లారెన్స్ `కాంచన-4`కి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. లారెన్స్ కి కూడా సరైన హిట్ పడి చాలా కాలమవుతోంది.
రాఘవ లారెన్స్ `కాంచన-4`కి రంగం సిద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. లారెన్స్ కి కూడా సరైన హిట్ పడి చాలా కాలమవుతోంది. కొత్త ప్రయత్నాలేవి ఫలించలేదు. దీంతో మరోసారి `ముని` సీక్వెల్ నే నమ్ముకోవాల్సి వచ్చింది. దీనిలో భాగంగా నాల్గవ ఇన్ స్టాల్ మెంట్ ని తెరపైకి తెస్తున్నారు. ఇప్పటికే స్టోరీ సిద్దమైంది. గోల్డ్ మైన్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
దీనిలో భాగంగా హీరోయిన్ గా ముంబై బ్యూటీ పూజాహెగ్డేని ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో పూజాకి క్రేజ్ ఉండటంతో? అమ్మడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో మరో హీరోయిన్ కి ఛాన్స్ ఉంది. ఇప్పుడా పాత్ర కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా పటేహీని తీసుకున్నారుట. లారెన్స్ ఇప్పటికే ఆమెని సంప్రదించి పాత్ర గురించి చెప్పగా అంగీకరించినట్లు తెలుస్తోంది.
అలాగే ఈపాత్ర పూజా హెగ్డే పాత్రకు ధీటుగా ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. లారెన్స్ పక్కన మెయిన్ లీడ్ పూజ అయినా? కథను మలుపు తిప్పే పాత్ర మాత్రం నోరాదే అవుతుందని అంటున్నారు. సినిమాలో ప్లాష్ బ్యాక్ లో వచ్చే థ్రిల్లింగ్ సన్నివేశాలు నోరాపైనే ఉంటాయని వినిపిస్తుంది. మొత్తానికి లారెన్స్ నోరా పటేహీకి పెద్ద పీట వేసినట్లే తెలుస్తోంది. నోరా పటేహీ తెలుగు ఆడియన్స్ కి బాగా సుపరిచితమే.
`బాహుబలి`లో ఐటం పాటలో నటించింది. అంతకు ముందు `టెంపర్` లో ఆడిపాడింది. ఆ తర్వాత `షేర్`, `లోఫర్` చిత్రాల్లోనూ మెరిసింది. చివరిగా వరుణ్ తేజ్ నటించిన `మట్కా`లో నటించింది. నటిగా ఇదే డెబ్యూ చిత్రం ఇక్కడ. కానీ ఈ సినిమా ఫెయిలైంది. అయినా ఆ వైఫల్యాలతో సంబంధం లేకుండా నోరాకి లారెన్స్ ఛాన్స్ ఇవ్వడం విశేషం.