తినడానికి అద్దె చెల్లించడానికి డబ్బుల్లేవు: నోరా ఫతేహి
నోరా దిల్బర్ పాటలో తన కాస్ట్యూమ్‌కి సంబంధించిన ఇబ్బందుల గురించి వెల్లడించింది.
బాహుబలి 'మనోహరి'గా నోరా ఫతేహికి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. ప్రభాస్ తో ప్రత్యేక గీతంలో అద్భుతమైన రొమాన్స్ చేసి అభిమానుల గుండెల్లో గిలిగింతలు పెట్టింది. నోరా ఫతేహి హిందీ చిత్రాలలో తన ఐటమ్ నంబర్ లతో ఉర్రూతలూగించింది. పలు చార్ట్ బస్టర్ సింగిల్ ఆల్బమ్స్ తోను పాపులారిటీ పెంచుకుంది. కెనడియన్ నటి కం డ్యాన్సర్ నోరా హిట్ నంబర్ 'దిల్బర్' చిత్రీకరణకు మొదట నిరాకరించినట్లు చెప్పారు. నోరా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024లో రాజీవ్ మసంద్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్లౌజ్ 'చాలా చిన్నగా' ఉన్నందున పాదాలను కిందకి దించి కవర్ చేసే ప్రయత్నం చేసాను'' అని గుర్తుచేసుకుంది.
నోరా దిల్బర్ పాటలో తన కాస్ట్యూమ్‌కి సంబంధించిన ఇబ్బందుల గురించి వెల్లడించింది. నేను ఆ దర్శకనిర్మాతలతో చర్చించేప్పుడు మొదట చెప్పినది, ''చూడండి మనం దీన్ని ఐటెమ్ సాంగ్‌గా చేయగలం.. మనం చూడగలం.. హాట్ అండ్ సె* .. కానీ కుటుంబం పిల్లలతో చూడాలి కదా?'' అని సూచించాను. పాటలో నా స్టెప్పులు చూసి ''అయ్యో, ఇది ఏ డ్యాన్స్ స్టైల్?, ‘హుక్ స్టెప్ చూడండి, అది పిచ్చిగా ఉంది.. దీన్ని ప్రయత్నించాలనుకుంటున్నాను'' అని కొందరు అనుకుంటారు. ఇలాంటి పాటల్లో కనిపించిన చాలా మంది అమ్మాయిలు కాస్త స్కిన్ చూపించి, ఆ తర్వాత విజృంభించాలని కోరుకుంటారు.. పాట హిట్ అవుతుంది... అని తెలిపింది.
ఓవర్ సె*వలైజ్డ్ కాస్ట్యూమ్స్‌పై నోరా ఫతేహి మాట్లాడుతూ ..కొరియోగ్రఫీతో మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కానీ.. కొరియోగ్రఫీ ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలని నేను కోరుకుంటాను. అలాగే ప్రత్యేక గీతానికి వారు నాకు బ్లౌజ్ తెచ్చినప్పుడు.. అది చాలా చిన్నది.. దానివల్ల నా కాలును క్రిందికి జరపాల్సి ఉంటుంది. అబ్బాయిలు.. నేను దీన్ని ధరించలేను. నన్ను అతిగా సె*వ*జ్ చేయవద్దు.. అని అంటాను. చివరకు నాకు అర్థమైంది ఇది సె* పాట.. అని ఓకే చేస్తాను. మనమంతా స్వాభావికంగా సె*గా ఉంటాము. కానీ మనం మరీ అసభ్యంగా ఉండవలసిన అవసరం లేదు. ఉదయం పాటను చిత్రీకరించబోతున్నప్పుడు, వారు కొత్త బ్లౌజ్ తయారు చేయవలసి వచ్చింది '' అని కూడా నోరా చెప్పింది. ''నాకు సౌకర్యంగా ఉండే కొత్త బ్లౌజ్‌ని వారు రీమేడ్ చేయాల్సి వచ్చింది. కొంతమందికి ఇది ఇప్పటికీ సెక్సీగా కనిపిస్తుంది.. కానీ నా వరకూ చూస్తే వారు నాకు ఇవ్వబోయే దానితో పోల్చితే నేను సౌకర్యవంతమైనది ఎంచుకున్నాను.. అని తెలిపింది.
నోరా చివరిసారిగా కునాల్ ఖేము దర్శకత్వం వహించిన తొలి చిత్రం - 'మడ్గావ్ ఎక్స్‌ప్రెస్'లో కీలక పాత్రలో కనిపించింది. తదుపరి వరుణ్ తేజ్ - మీనాక్షి చౌదరి జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా 'మట్కా'తో తెలుగు అరంగేట్రం చేస్తోంది. బాహుబలిలో 'మనోహరి..' పాటలో నర్తించాక నోరా ఫతేహికి ఇది మరో పెద్ద అవకాశం.
ఉచితంగా చేసాను:
తనదైన అందం డ్యాన్సింగ్ ప్రతిభతో ఉర్రూతలూగిస్తున్న నోరా ఫతేహి తన కెరీర్ ఆరంభంలో తినడానికి, అద్దె కట్టడానికి కూడా తన వద్ద డబ్బు లేదని నిజాయితీగా తెలిపింది. కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని దిల్ బర్, కమారియా పాటలలో ఉచితంగా నర్తించానని తెలిపింది.