దోచేసే ఏజెన్సీలతో విసిగిపోయాను: నోరా ఫతేహి
ఆ ప్రయాణంతో నేను అవాక్కయిన సందర్భాలున్నాయి. విదేశీయులను దోపిడీ చేసే ఏజెన్సీలను నేను ఎదుర్కొన్నాను'' అని నోరా తెలిపింది.
ఇటీవల బాలీవుడ్ కపుల్స్ గురించి వారి పెళ్లి వెనక రహస్యాల గురించి ఓపెన్ గా వ్యాఖ్యానించింది నోరా ఫతేహి. నోరా వ్యాఖ్యలు వివాదానికి తెరతీసాయి. బాహుబలి మనోహరిగా సుపరిచితురాలైన నోరా మొరాకో మూలాలున్న కెనడియన్ డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే.
కొన్ని అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్‌తో గొప్ప పేరును సంపాదించుకున్న నోరా ఫతేహి ప్రస్తుతం 'మడ్గావ్ ఎక్స్‌ప్రెస్' అనే హిందీ చిత్రంలో నటించింది. ఈ సినిమా గురించి మాట్లాడుతూనే, తన కెరీర్ జర్నీ ఆరంభంలో ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుందో కూడా వెల్లడించింది.
ఇండస్ట్రీలో ఆరంభం నుంచి తనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని కూడా నోరా తెలిపింది. ''నేను కెనడా నుండి హిందీ చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుండి అవకాశాల్ని అందుకోవడం నిజానికి నాకు సవాలుగా ఉంది. అప్పటికి నాకు బాలీవుడ్ గురించి ఏమీ తెలియదు. కేవలం 20 ఏళ్ల వయస్సులో ఉన్నాను. ముంబై సబర్బ్‌ల మధ్యలో జీవితాన్ని నెట్టుకు రావడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు బాయ్‌ఫ్రెండ్ లేరు.. ఇండస్ట్రీ నుంచి ఎవరూ లేరు. నేను చాలా సమయం తీసుకున్నాను. ఆ ప్రయాణంతో నేను అవాక్కయిన సందర్భాలున్నాయి. విదేశీయులను దోపిడీ చేసే ఏజెన్సీలను నేను ఎదుర్కొన్నాను'' అని నోరా తెలిపింది.
చిత్రసీమలో నేను ఏ ప్రయాణం ప్రారంభించినా... అది నా గానం, డ్యాన్స్ లేదా పాడటం లేదా షోలకు న్యాయనిర్ణేతగా కొనసాగడం.. ఏం చేసినా నేను గౌరవం అందుకోవాలని కోరుకుంటున్నాను. పబ్లిక్ ఫిగర్‌గా నేను ఎప్పుడూ ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటాను. 'మడ్గావ్ ఎక్స్‌ప్రెస్' రిలీజ్ తర్వాత నా కెరీర్‌లో కచ్చితంగా మార్పు వస్తుంది. ముగ్గురు అద్భుతమైన నటుల మధ్య నేను కనిపిస్తాను. నేను కూడా విమర్శకులచే గుర్తింపు అందుకోవటం వాస్తవానికి బహుమతి కంటే ఎక్కువ.. అని తెలిపింది.
నటిగా విజయాన్ని రుచి చూసిన తర్వాత మరింత బాధ్యతగా పని చేస్తున్నారా? అన్న ప్రశ్నకు... నేను ఎప్పుడూ చాలా బాధ్యతతో ఉన్నాను. హిందీ నేర్చుకునేందుకు ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో విదేశీ పాత్రలకు దూరంగా ఉన్నాను. నేను ఆగ్నేయ ఆసియా డయాస్పోరాతో అనుబంధం కలిగి ఉన్న బ్రాండ్‌ని. నేనే బ్రౌన్ కుటుంబం నుండి వచ్చాను కాబట్టి ఆ తెల్లజాతి అమ్మాయి పాత్రలు చేయడంలో నాకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదు. మూస పద్ధతులను బ్రేక్ చేయడానికి నేను భారతదేశంలో నటిగా ఉన్నాను... అని తెలిపింది.
సినిమా రంగం మీకు అనుకూలంగా మారిందా? అని ప్రశ్నించగా... అది అంత త్వరగా జరగదని నోరా తెలిపింది. నేను బహుముఖ పర్సనాలిటీ అని, విభిన్నమైన పనులు చేస్తానని పరిశ్రమ వ్యక్తులకు తెలుసు. ఇప్పుడు నాకు ఎక్కువ పని ఇవ్వడానికి వారంతా నన్ను ఎంపిక చేసుకుంటున్నారని టాక్ ఉంది. నేను ఎప్పుడూ నా తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారిస్తాను. నేను ప్రస్తుతం కొన్ని సింగిల్ ఆల్బమ్స్ ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాను. మట్కా అనే సౌత్ సినిమా కూడా చేస్తున్నాను. బీ హ్యాపీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను.. అని తెలిపింది.
మీరు ఒకే తరహా పాత్రల్లో చేస్తున్నారని టాక్ ఉంది..! అని ప్రశ్నించగా.. ఇండస్ట్రీ నన్ను ముఖ్యమైన పాత్రల కోసం పరిగణించాలని అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను నటిగా తెరపైకి తీసుకురావడానికి చాలా ఉన్నాయి. ప్రత్యేక పాటలు చేయాలని నా వద్దకు ఎవరు వచ్చినా, అది కథ ప్రదర్శన కోరితేనే చేస్తానని వారికి తెలుసు. నాకు కేవలం హాట్‌గా కనిపించడం పనికిరాదు. నేను చాలా వ్యూహాలు, ప్రణాళికలు వేసుకుంటాను.. అని తెలిపింది.
పశ్చిమం వైపు మీ ప్రయాణాన్ని మీరు ఎలా చూస్తారు? అని ప్రశ్నించగా.. ఇది బాలీవుడ్ కంటే కఠినమైనది, ఇంతకంటే కఠినమైనది మరొకటి లేదు (నవ్వుతూ). ఈ పరిశ్రమకు కలుపుకుపోవాలనే ఆలోచన లేదు. కత్రినా కైఫ్ మిలియన్ల మందిలో అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. జరుగుతున్న పరిణామాన్ని చూసి నేను సంతోషంగా ఉన్నాను. ప్రజలు మరింత ఓపెన్ మైండెడ్‌గా ఉన్నారు... అని పేర్కొంది.