ఒకే ప్రేమ్ లో సూప‌ర్ స్టార్స్ త్ర‌యం!

ఆఫ్ ది స్క్రీన్ లో న‌ట భూష‌ణ్- సూప‌ర్ స్టార్ కృష్ణ‌ది ఎంతో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది.;

Update: 2025-03-27 05:30 GMT
ఒకే ప్రేమ్ లో సూప‌ర్ స్టార్స్  త్ర‌యం!

ఆఫ్ ది స్క్రీన్ లో న‌ట భూష‌ణ్- సూప‌ర్ స్టార్ కృష్ణ‌ది ఎంతో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. ఇద్ద‌రు మంచి స్నేహితులు. క‌లిసి ఎన్నో చిత్రాల్లో న‌టించారు. `గుఢ‌చారి 116`కి కోసం తొలిసారి చేతులు క‌లిపారు. అప్ప‌ట్లో ఈసినిమా ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలిచింది. గుఢ‌చారి స్టోరీల‌కు పునాది వేసింది ఈజోడీనే. మ‌ల్లి ఖార్జ‌న‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రంలో కృష్ణ మెయిన్ లీడ్ పోషించ‌గా...శోభ‌న్ బాబు ఏజెంట్ 303 శివ పాత్ర‌లో అద‌ర‌గొట్టారు.

Krishna, Sobhan Babu, and Dasari Narayana Rao One frame Photo Viral

ఈ సినిమాతో ఈకాంబినేష‌న్ అంటే ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఏర్ప‌డింది. మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చిన జోడీ ఇది. అటుపై `ల‌క్ష్మీ నివాసం`, ` మా మంచి అక్క‌య్య‌`, `పుట్టినిల్లు మెట్టినిల్లు`, `మంచి మిత్రులు`,` గంగ మంగ`,` కురుక్షేత్రం`, `కృష్ణార్జునులు`, `మండే గుండెలు`, `ముంద డుగు`, `ఇద్దరు దొంగలు`, `మహా సంగ్రామం` లాంటి ఎన్నో సినిమాల్లో న‌టించారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఇవ‌న్నీ అప్పట్లో క్లాసిక్ హిట్స్ గా నిలిచాయి.

చిరవగా `ఆస్తి మూరెడు ఆస్తి బారేడు` సినిమాలో కృష్ణ అతిథి పాత్రలో మెరిసారు. అలా సినిమాల ద్వారా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి స్నేహం ఉండేద‌న్న‌ది చాటి చెప్పారు. వీళ్ల‌తో పాటు అప్పుడ‌ప్పుడు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఆ ద్వ‌యంలో క‌లిసేవారు. తాజాగా ఆ త్ర‌యం క‌లిసి దిగిన ఓ రేర్ పిక్ నెట్టింట వైర‌ల్ అవుతోందిప్పుడు. శోభ‌న్ బాబు-దాస‌రి నారాయ‌ణ‌రావు-కృష్ణ ముగ్గురు క‌లిసి సినిమా ఈవెంట్ కి హాజ‌రైన్ పిక్ ఇది.

అభిమానులు పూల మాల‌తో అప్ప‌ట్లో స‌త్క‌రించిన స‌న్నివేశం. అప్ప‌టి అభిమానులు త‌మ హీరోల‌కు మెడ‌లో పూల‌ల వేసి స‌త్క‌రించుకునే వారు. నాటి పిక్ నేడు ఇలా నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో చాలా కాలం త‌ర్వాత అభిమానులకు ఇలా చూసుకునే అవ‌కాశం ద‌క్కింది.

Tags:    

Similar News