చిరంజీవి అంత కానివాడయ్యాడా..?

తెలుగు సినీ పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉన్న వీరిద్దరు మన మెగాస్టార్ కి వచ్చిన ఈ అత్యున్నత పురస్కారం గురించి మాట్లాడకపోవడం అందరిని ఆలోచనలో పడేస్తుంది.

Update: 2024-02-04 10:30 GMT

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్రం అత్యున్నత పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత రత్న తర్వాత దేశంలో రెండో అత్యున్నత పురస్కారమైన ఈ గౌరవాన్ని అందుకున్నందుకు చిరంజీవికి సినీ రాజకీయ ప్రముఖులు అందరు స్పెషల్ గ్రీటింగ్స్ తెలియచేస్తున్నారు. సినిమా పరిశ్రమ తరపున ఒక మెగా ఈవెంట్ చేసి చిరుని సత్కరించబోతున్నారు.

ఇప్పటికే రాజకీయ సినీ ప్రముఖులంతా కలిసి చిరంజీవిని సత్కరించారు. ఐతే ఇతర పరిశ్రమల నుంచి కూడా కొంతమంది చిరుని గ్రీట్ చేయగా కోలీవుడ్ నుంచి ఎవరు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పద్మవిభూషణ్ గా చిరుని కేంద్ర సత్కరించిన ఈ టైం లో చిరంజీవి గురించి తమిళ హీరోలెవ్వరు నోరు విప్పట్లేదు.

సరే ఇప్పటి హీరోలు ఏమో కానీ సీనియర్ స్టార్ హీరోలైన రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి వారు కూడా కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తెలుగు సినీ పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉన్న వీరిద్దరు మన మెగాస్టార్ కి వచ్చిన ఈ అత్యున్నత పురస్కారం గురించి మాట్లాడకపోవడం అందరిని ఆలోచనలో పడేస్తుంది.

ఈ విషయంపై వారు సైలెంట్ గా ఉన్న కారణాలు ఏంటన్నది ఆడియన్స్ ఆలోచిస్తున్నారు. తెలుగు పరిశ్రమకు చెందిన వ్యక్తికి వచ్చిందనే ఉద్దేశంతో కమల్, రజిని ఈ విషయంపై స్పందించట్లేదా లేదా మరేదైనా కారణం ఉందా అన్నది తెలియదు కానీ పద్మవిభూషణ్ వచ్చిన సందర్భంగా చిరుని విష్ చేయకపోవడంతో వాళ్లకు చిరు అంత కానివాడయ్యాడా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి ప్రస్థానం ఏంటన్నది దాదాపు ప్రతి సినీ ప్రేమికుడికి తెలిసిందే. స్వయంకృషితో ఎదిగి ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా తిరుగులేని శక్తిగా మారారు చిరంజీవి. ఇప్పుడు కాదు 90వ దశకంలోనే తెలుగు సినిమా గురించి నేషనల్ లెవెల్ లో మాట్లాడుకునేలా చేశాడు చిరంజీవి. అందుకే ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను కేంద్రం పద్మవిభూషణ్ సత్కరించింది. చిరుకి ఈ అవార్డ్ రావడం పట్ల మెగా ఫ్యాన్స్ తో పాటుగా తెలుగు సినీ పరిశ్రమ కూడా ఎంతో సంతోషంగా ఉంది.


Tags:    

Similar News