నాగ చైతన్య రెస్టారెంట్ గురించి ఎన్టీఆర్ జపాన్ లో ప్రమోషన్
ఐతే అదంత ఒకప్పుడు ఇప్పుడు తన లుక్ అండ్ ఫిజిక్ మీద చాలా ఫోకస్ గా ఉంటున్నాడు.;

మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అని అందరికీ తెలిసిందే. తను అంత ఫిట్ గా ఉండటానికి తను ఫాలో అయ్యే డైట్ ఒక రీజన్ ఒక రీజన్ అయితే.. కొన్నిసార్లు ఎన్టీఆర్ ఈ కండీషన్స్ అన్నిటినీ పక్కన పెట్టి ఎంచక్కా కడుపునిండా భుజిస్తాడు అన్నది సన్నిహితులు చెబుతుంటారు. ఒంటి చేత్తో ఫ్యామిలీ ప్యాక్ అయినా తినేస్తానని ఎప్పుడో మన తారక రాముడు చెప్పేశాడు. ఐతే అదంత ఒకప్పుడు ఇప్పుడు తన లుక్ అండ్ ఫిజిక్ మీద చాలా ఫోకస్ గా ఉంటున్నాడు.
అంతేకాదు సినిమా సినిమాకు క్యారెక్టరైజేషన్ కి తగినట్టుగా తన లుక్ ఉండాలని కాస్త డైట్ కంట్రోల్ చేసుకున్నాడు. అయినా సరే ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది అన్నది ఎన్టీఆర్ కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే జపాన్ మీడియాతో కూడా హైదరాబాద్ రుచులు, బిర్యాని గురించి ప్రస్తావించి అక్కడ ఫ్యాన్స్ ని అలరించాడు తారక్.
ముఖ్యంగా జపనీస్ ఐటమ్స్ అన్నీ షోయు అదే మన నాగ చైతన్య రెస్టారెంట్ లో దొరుకుతుందని అన్నాడు ఎన్టీఆర్. దానితో పాటుగా షాదాబ్, స్పైస్ వెన్యూ, కాకతియా డీలక్స్ మెస్, తెలంగాణా స్పైస్ కిచెన్, పాలమురు గ్రిల్ ఇలా తనకు నచ్చే ఐటమ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో వాటి గురించి చెబుతూ ఆ రెస్టారెంట్ పేర్లను సైతం స్పెషల్ గా మెన్షన్ చేశాడు ఎన్టీఆర్. ఒక రకంగా చెప్పాలంటే ఆ రెస్టారెంట్స్ అనంటికీ జపాన్ లో ఎన్టీఆర్ ఫ్రీ పబ్లిసిటీ చేశాడని చెప్పొచ్చు.
ఎన్టీఆర్ మనసుకి నచ్చిన భోజనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ కి కూడా తెలియదు కావొచ్చు. కానీ దేవర 1 రిలీజ్ సందర్భంగా జపాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తారక్ అక్కడ మీడియాతో మన లోకల్ రుచుల గురించి ఫుడ్ ఐటమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. జపాన్ మీడియాలో మన హైదరాబాద్ బిర్యాని ఇంకా రకరకాల ఐటెంస్ గురించి మాట్లాడటం చూసి తెలుగు ఆడియన్స్ అయితే సూపర్ అనేస్తున్నారు.
దేవర 1 సినిమా జపాన్ లో శుక్రవారం రిలీజైంది. ఆర్.ఆర్.ఆర్ తో అక్కడ ఆడియన్స్ కు దగ్గరైన ఎన్టీఆర్ మళ్లీ దేవర 1 సినిమాతో వాళ్ల ముందుకు వచ్చాడు. సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ కొరటాల శివ అండ్ టీం చాలా కష్టపడ్డారు.