రాముడిలా నటించడం కష్టం.. ఈ జన్మ అభిమానులకు అంకితం : ఎన్టీఆర్

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా మ్యాడ్ స్క్వేర్.;

Update: 2025-04-05 03:56 GMT
NTR Steals the Show with Emotional Speech

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న సినిమా మ్యాడ్ స్క్వేర్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాను కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయగా సినిమాలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు నటించారు. మార్చి 28న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.

RRR తర్వాత రిలీజైన దేవర సినిమా రిలీజ్ టైం లో కూడా ఎలాంటి ఈవెంట్ లేకుండా సినిమా రిలీజ్ చేశారు. అందుకే ఎన్టీఆర్ గెస్ట్ గా మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ అని తెలియగానే ఫ్యాన్స్ అంతా కూడా మాక్సిమం అటెండ్ అయ్యారు. ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ స్పీచ్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. మ్యాడ్ స్క్వేర్ సినిమా సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరి గురించి ప్రస్తావిస్తూ మాట్లాడారు ఎన్టీఆర్.

ఇలాంటి సినిమా తీయాలంటే దర్శకుడికి ప్యూర్ హార్ట్ ఉండాలని. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపించారు ఎన్టీఆర్. ఇక మ్యాడ్ స్క్వేర్ సినిమా విష్ణు లేకపోతే సినిమా లేదని అన్నారు. ఒక నటుడిగా కామెడీ చేయడం ఎంత కష్టమో తనకు తెలుసని అన్నారు తారక్. రాముడిగా చేయడం కష్టమా.. రావణుడిగా చేయడం కష్టమా అంటే రాముడిగా నటించడమే కష్టమని చెబుతా అని అన్నారు ఎన్టీఆర్.

విష్ణు కూడా తన స్వతహాగా అంత ఇన్నోసెంట్ గా ఉంటారా అన్నది తెలియదు కానీ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకున్నారని అన్నారు. ఇక సినిమాలో నటించిన ముగ్గురు హీరోలు సంగీత్ శోభన్, రామ్ నితిన్, నార్నె నితిన్ ల గురించి మాట్లాడారు ఎన్టీఆర్. సంగీత్ శోభన్, సంతోష్ లను చూస్తుంటే వాళ్ల నాన్న శోభన్ గారే గుర్తొస్తారు. సంగీత్ సక్సెస్ తో శోభన్ గారు మన మధ్యే ఉండి సంగీత్ సక్సెస్ ని చూసి గర్వపడతారని అన్నారు ఎన్టీఆర్.

ఇక రామ్ నితిన్ ని చూస్తే తనను తాను చూసుకున్నట్టు ఉందని అన్నారు తారక్. తనలో ఎనర్జీ బాగుందని అన్నారు. ఇక నార్నె నితిన్ గురించి చెబుతూ 2011 లో తన మ్యారేజ్ టైం లో నితిన్ చాలా చిన్న పిల్లాడు. సరిగా మాట్లాడటానికి కూడా భయపడే వాడు. ఆ తర్వాత తను నాతో చెప్పిన ఒకే ఒక్క మాట యాక్టర్ ని అవుతానని.. ఐతే నీ మనసుకి నచ్చింది చేసుకుంటూ వెళ్లమని చెప్పానని అన్నారు తారక్.

ఇక బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు తర్వాత ఆ స్థాయిలో కామెడీ పండించగల నటుడు సునీల్. ఆయన నవ్వించడానికే పుట్టాడని నేను నమ్ముతానని అన్నారు. అంతేకాదు సినిమాలో ఫాదర్ రోల్ చేసిన మురళీధర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఎన్టీఆర్. ఆయనతో పాటు సినిమాలో ఆంటోని రోల్ చేసిన నటుడి గురించి కూడా మ్యాడ్ పార్ట్ 1 లోని ఒక డైలాగ్ ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక నిర్మాత నాగవంశీ గురించి కూడా స్పెషల్ మెన్షన్ చేస్తూ మాట్లాడారు ఎన్టీఆర్.

ఈ క్రమంలో మ్యాడ్ స్క్వేర్ టీం అందరికీ కంగ్రాట్స్ చెప్పి ఫైనల్ గా అభిమానులను ఉద్దేశిస్తూ ఈ జన్మ అభిమానులకు అంకితం అని నాన్న గారితో చెప్పాను.. మిమ్మల్ని ఆనందపరిచే సినిమాలు చేస్తూ ఉంటానని స్పీచ్ ముగించారు ఎన్టీఆర్.

Tags:    

Similar News