హాలీవుడ్ బ్యాన‌ర్‌పైనే క‌న్నేసిన యంగ్ య‌మ‌

ఇలాంటి స‌మయంలో ఇటీవలి మీడియా ఇంటరాక్షన్‌లో తార‌క్ అన్న మాట నిజంగా మైండ్ బ్లాక్ చేసింది.

Update: 2024-10-06 03:12 GMT

''కాళ్ళు ఉన్నోడు ముందే చూస్తాడు.. కానీ దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు!``.. ఇదీ `దూకుడు` సినిమాలోని ఒక డైలాగ్. దీనిని ఆచ‌రణ‌లో పెట్ట‌డంలో ఇత‌ర హీరోల కంటే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ జ‌రంత స్పీడ్ గా ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో అత‌డు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. స‌రైన స‌మ‌యంలో కెరీర్ ప‌రంగా స‌రైన మ‌లుపు ఇది. ఇప్పుడు `వార్ 2`లో న‌టిస్తూ త‌న స్థాయిని మ‌రింత పెంచుకోబోతున్నాడు. అద‌నంగా 'దేవ‌ర-1' త‌న‌కు మంచి మైలేజ్‌నిచ్చింది. `దేవ‌ర 1` త‌ర్వాత `దేవర 2`తోను అభిమానుల ముందుకు వ‌స్తాడు.

ఇలాంటి స‌మయంలో ఇటీవలి మీడియా ఇంటరాక్షన్‌లో తార‌క్ అన్న మాట నిజంగా మైండ్ బ్లాక్ చేసింది. అత‌డు పాపుల‌ర్ `మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్`లో చేరాలని తన కోరికను వ్యక్తం చేశాడు. మార్వెల్ ప్రపంచంలో భాగమవ్వడానికి ఇష్టపడతాను.. ఎందుకంటే మార్వెల్ నాకు చాలా ప్రత్యేకమైనది. ఐరన్ మ్యాన్ క‌చ్చితంగా నాకు ఇష్టమైన పాత్రలలో ఒకటి. ఎందుకంటే మీకు సూపర్ పవర్స్ ఉండవలసిన అవసరం లేదు.. శక్తులు కలిగి ఉండటానికి మీరు దేవుడు కానవసరం లేదు. మీకు తెలుసా అతడు కేవలం మానవుడు. అతడు త‌న మ‌న‌స్సుతో అది సాధించాడు. ప్రతి ఒక్కరూ సూపర్ హీరోలు కావడం చాలా సులభం. నువ్వు, నేను, మేమంతా. కాబట్టి మార్వెల్ నాకు చాలా ఎగ్జ‌యిట్ చేసేది. నేను క‌చ్చితంగా మార్వెల్ ప్రపంచంలో భాగం కావాలనుకుంటున్నాను`` అని అన్నాడు.

మార్వ‌ల్ సినిమాల్ని కిడ్స్ విప‌రీతంగా అభిమానిస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు తార‌క్ పిల్ల‌లు మిన‌హాయింపు కాదు. ఎన్టీఆర్ తన పిల్లలు కూడా మార్వెల్‌ను ఇష్టపడతారని, తాను మార్వెల్ ప్రపంచంలో చేరితే వారు అతడిని చూసి గర్వపడతారని అన్నారు. నిజానికి మార్వ‌ల్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ స్టోరీ టీమ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని దృష్టిలో ఉంచుకుని ఒక పాత్రను సృష్టిస్తే దానిని హాలీవుడ్ తార‌ల‌కు ధీటుగా ర‌క్తి క‌ట్టించ‌గ‌ల ప్ర‌తిభావంతుడు. అందుకే అత‌డి వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిని క‌లిగిస్తున్నాయి.

తార‌క్ త‌దుప‌రి దేవ‌ర 2ని పూర్తి చేసి విడుద‌ల చేయాల్సి ఉంది. కాన్వాస్ ప‌రంగా మొద‌టి భాగం కంటే చాలా పెద్ద స్పాన్ తో ఉంటుంద‌ని కూడా తార‌క్ వెల్ల‌డించారు. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించే ముందు వార్ 2 ప‌నుల్ని తార‌క్ పూర్తి చేస్తాడు.

Tags:    

Similar News