వెండితెర మీద ఎన్టీఆర్.. బుల్లితెర మీద నాని..?

థియేటర్ లకు ప్రేక్షకులు రాకపోవడానికి OTTలు ప్రధాన కారణమని ఇప్పటికే నిర్మాతలకు అర్థమైంది.

Update: 2024-09-05 04:15 GMT

థియేటర్ లకు ప్రేక్షకులు రాకపోవడానికి OTTలు ప్రధాన కారణమని ఇప్పటికే నిర్మాతలకు అర్థమైంది. అందుకే అంతకుముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం సినిమా రిలీజైన 8 వారాల దాకా ఓటీటీ రిలీజ్ కాకుండా చూడాలని అనుకుంటున్నారు. ఐతే కొన్ని డిజాస్టర్ సినిమాలు అలా రిలీజైన 20 రోజుల్లోనే ఓటీటీలో దర్శనం ఇస్తున్నాయి. ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అన్నది నిర్మాతల చేతుల్లో కూడా లేకుండా పోయింది. సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా నెల నెలన్నర లోపే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. దీనిపై నిర్మాతలందరు మరోసారి చర్చ జరిపించాల్సి ఉంది.

ఐతే ఈ నెల చివరన ఎన్టీఆర్ దేవర సినిమాతో వస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంది. RRR తర్వాత తారక్ చేస్తున్న సినిమా ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా సినిమాను చేస్తున్నారు. సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ దేవర రిలీజ్ అవుతుంది. ఐతే వెండితెర మీద తారక రాముడు వస్తున్న అదే టైం లో బుల్లితెర మీద అదే డిజిటల్ స్ట్రీమింగ్ లో నాని సరిపోదా శనివారం వస్తుందని టాక్.

నాని లీడ్ రోల్ లో వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సరిపోదా శనివారం. ఆగష్టు 29న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది. మధ్యలో వర్షాల వల్ల కాస్త జోరు తగ్గించినట్టు అనిపించినా సినిమా అన్ని చోట్ల ప్రాఫిట్స్ తెచ్చి పెడుతుందని అంటున్నారు. ఐతే సూపర్ హిట్ అయిన సరిపోదా శనివారం సినిమాను కూడా ఈ నెల చివరనే అంటే రిలీజైన నెల లోపే ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

డివివి దానయ్య నిర్మించిన సరిపోదా శనివారం సినిమా డిజిటల్ రైట్స్ ని జీ 5 దక్కించుకుంది. సెప్టెంబర్ 27 లేదా అక్టోబర్ మొదటి వారం ఈ సినిమా OTT రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. నాని నుంచి దసరా తర్వాత వచ్చిన పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమాగా సరిపోదా శనివారం సినీ లవర్స్ కి సరిపోయేంత ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ సినిమాతో నాని బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. సో థియేటర్ లో తారక్, స్మాల్ స్క్రీన్ పై నాని ఈ ఇద్దరు కూడా ఒకేసారి తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Tags:    

Similar News