వార్2 మేకర్స్ పై తారక్ ఫ్యాన్స్ గుస్సా
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
దేవర తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా వార్2. బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే ఎన్టీఆర్ మొదటిగా బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తారక్, హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఇద్దరు హీరోలనూ ఒకే స్క్రీన్ పై చూడాలని అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ ఫ్యాన్స్ అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తైందని మేకర్స్ చెప్తున్నారు. అయినప్పటికీ వార్2 నుంచి ఎన్టీఆర్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఆయన ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇప్పటికైనా వార్2 నుంచి తారక్ పాత్రకు సంబంధించిన అప్డేట్ ఇస్తే బావుంటుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మేకర్స్ ను రిక్వెస్ట్ చేస్తూ ఈ విషయాన్ని ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే వార్2 లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
అదే నిజమైతే ఎన్టీఆర్ యాక్టింగ్ లోని మరో యాంగిల్ ను వార్2 లో చూడొచ్చు. దీంతో వార్2 లో నెగిటివ్ రోల్ లో ఎన్టీఆర్ ఎలా కనిపించబోతున్నాడో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే మేలో ఉండటంతో అప్పటివరకు ఆగకుండా దానికంటే ముందే ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమాపై బజ్ పెంచాలనే ఆలోచనలో వార్2 మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
వార్2 సినిమాలో ఇద్దరు హీరోలు నటిస్తున్న నేపథ్యంలో సినిమా నుంచి ఒక టీజర్ కాకుండా రెండు టీజర్‌లను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అందులో ఒకటి ఎన్టీఆర్ పాత్రపై, మరొకటి హృతిక్ పాత్రపై ఉండేలా ఆ టీజర్లను కట్ చేయనున్నారట. వార్2పై టాలీవుడ్, బాలీవుడ్ ఆడియన్స్ తో పాటూ దేశ వ్యాప్తంగా ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ కానుంది.