'నాటు నాటు' రేంజ్ లో ఆ ఇద్దరి మధ్య పాట మొదలైందా?
టాలీవుడ్ లో ఓ ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే సంచలనం అలా ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పారు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'నాటు నాటు' పాటలో ఏ రేంజ్ లో పోటీ పడి డాన్సు చేసారో తెలిసిందే. ఇద్దరి మధ్య రాజమౌళి అలాంటి పాట ఒకటి ప్లాన్ చేసాడు? అని రిలీజ్ వరకూ తెలియనే తెలియదు. థియేటర్లో ఆడియన్స్ కి ఆ పాట ఓ బిగ్ సర్ ప్రైజ్ ని అందించింది. చరణ్-తారక్ మధ్య పోటీ ఆ రేంజ్ లో ఉంటుందని ఆడియన్స్ ఏమాత్రం గెస్ చేసి ఉండరు. ఆ పాట ఏకంగా ఆస్కార్ అవార్డునే గెలుచుకుంది.
టాలీవుడ్ లో ఓ ఇద్దరు స్టార్ హీరోలు కలిస్తే సంచలనం అలా ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పారు. మరి ఇలాంటి నాటు నాటు ఊర మాస్ పాటని ఎన్టీఆర్-హృతిక్ రోషన్ మధ్య కూడా ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. తాజాగా ఆ పాట చిత్రీకరణ నేటి నుంచి మొదలైనట్లు సమాచారం. ఇందులో హృతిక్ రోషన్-ఎన్టీఆర్ పోటా పోటీగా డాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈపాట ఓ పురాతన కాలానికి సంబంధించిన పాటగా ఉంటుందని ఇప్పటికే విషయం బయటకు వచ్చింది. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పాట కూడా ఇండియాని ఊపేయడం ఖాయమే. షూటింగ్ కి సంబంధించి ఇదే చివరి షెడ్యూల్ అని సమాచారం. ఈ షెడ్యూల్తో పాటలు సహా టాకీపార్ట్ పూర్తవుతుందట. ప్రస్తుతం ఇద్దరు ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వార్ -2' లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
స్పై యాక్షన్ థ్రిల్లర్ గా దీన్ని యశ్ రాజ్ ఫిలింస్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎంత వేగంగా పూర్తవుతుందా? అని తారక్ ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ ఇప్పటికే తారక్ కోసం ఆన్ సెట్స్ లో ఎదురు చూస్తున్నాడు. 'డ్రాగన్' తొలి షెడ్యూల్ మొదలైంది. దీనిలో భాగంగా తారక్ లేని సన్నివేశాలు చిత్రీకరిస్తోన్న సంగతి తెలిసిందే.