సౌత్ బజ్ నెక్స్ట్ లెవెల్..!
బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆ సినిమా సీక్వెల్ ని పక్కన పెట్టి వార్ 2 సినిమా చేస్తున్నాడు.;

బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఆ సినిమా సీక్వెల్ ని పక్కన పెట్టి వార్ 2 సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో పాటుగా మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో భాగం అవ్వడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఎన్ టీ ఆర్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ వల్ల వార్ 2కి బాలీవుడ్ లో కన్నా సౌత్ లో ఎక్కువ క్రేజ్ పెరిగింది. అందులో భాగంగానే హృతిక్ రోషన్ ఎక్కడ ఈవెంట్ కి వెళ్లినా తారక్ గురించి అతని నటన గురించి ప్రత్యేకంగా చెబుతున్నాడు.
సో వార్ 2 సౌత్ ఆడియన్స్ కు మాత్రమే కాదు నార్త్ ఆడియన్స్ కి కూడా ఎన్టీఆర్ అంటే ఏంటో చూపించేలా చేస్తాడని తెలుస్తుంది. సాధారణంగా హిందీ సినిమాలకు సౌత్ లో అంత గొప్ప క్రేజ్ ఉండదు. జస్ట్ సినిమా రిలీజ్ టైం లో ఇంటర్వ్యూస్ తప్ప మిగతా హడావిడి ఏది ఉండదు. కానీ వార్ 2 ప్లానింగ్ వేరేలా ఉంది. సినిమాను సౌత్ లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగులో వార్ 2 స్ట్రైట్ సినిమాలానే రిలీజ్ చేసేలా చూస్తున్నారు. అదే జరిగితే వార్ 2 బజ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందని చెప్పొచ్చు. ఐతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ది నెగిటివ్ రోల్ అన్న టాక్ వినిపిస్తుంది. తారక్ రోల్ ని పర్ఫెక్ట్ గా చూపించగలిగితే మాత్రం నార్త్ సైడ్ ఏమో కానీ సౌత్ లో ముఖ్యంగా తెలుగులో సినిమా రిజల్ట్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే మేకర్స్ కూడా వార్ 2 మీద ఎక్కువ హైప్ తీసుకు రావట్లేదని తెలుస్తుంది.
టీ సీరీస్ నిర్మిస్తున్న వార్ 2 సినిమాను ఆగష్టు 14న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. వార్ 2 ప్రమోషన్స్ ని నార్త్ సైడ్ కి ఈక్వల్ గా సౌత్ ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి తెలుగులో వార్ 2 కి మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వార్ 2 మేకర్స్ ప్లాన్ ఏంటన్నది చూడాలి.
ఆర్.ఆర్.ఆర్ లో భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నార్త్ ఆడియన్స్ ని అలరించాడు. వార్ 2 తో స్ట్రైట్ సినిమాతో అక్కడ మెప్పు పొందాలని చూస్తున్నాడు. మరి ఈ మెగా మాస్ యాక్షన్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.