భాషతో సంబంధం లేకుండా తారక్ జర్నీ
యంగ్ గైటర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎంతో ఇన్నో వేటివ్ గా సినిమాలు చేస్తున్నారు. రోటీన్ సినిమాలకు దూరంగా వైవిథ్యమైన కథల్లో నటించే ప్రయత్నం చేస్తున్నారు.
యంగ్ గైటర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎంతో ఇన్నో వేటివ్ గా సినిమాలు చేస్తున్నారు. రోటీన్ సినిమాలకు దూరంగా వైవిథ్యమైన కథల్లో నటించే ప్రయత్నం చేస్తున్నారు. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత `దేవర`తో తొలి పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ రెండు రిలీజ్ లు కంటే ముందే తారక్ కథల విషయంలో కేరింగ్ మొదలైంది. `నాన్నకు ప్రేమతో`, `జనతా గ్యారేజ్`,` జై లవకుశ` లాంటి వరుస విజయాలు తారక్ ని అగ్ర స్థానంలో కొనసాగించాయి.
ఆ ప్రయాణంలో ఎక్కడా తప్పటడుగులు పడకుండా ముందుకెళ్తున్నారు. తాజాగా తారక్ లైనప్ చూస్తుంటే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు. దర్శకుల విషయంలో భాషలతో సంబంధం లేకుండా కమిట్ అవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో `వార్-2` లో నటిస్తున్నారు. యాక్షన్ చిత్రాలకు పేరుగాంచినా ఆయాన్ ముఖర్జీ ఈ సినిమాని తెరకెక్కి స్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మరో యాక్షన్ మేకర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తారు.
ప్రశాంత్ నీల్ తెలుగు వాడైన కన్నడిగీ. అలాగే కోలీవుడ్ సంచలన దర్శకులు అట్లీ, వెట్రీమారన్ తో సైతం తారక్ ప్రాజెక్ట్ లున్నాయి. వెట్రీమారన్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. `దేవర` ప్రమోషన్ లో భాగంగా వెట్రీమారన్ స్టోరీ రెడీగా ఉందంటే తాను డేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నానంటూ తారక్ మీడియా ముఖంగానే చెప్పారు. `జవాన్` తో పాన్ ఇండియాలో సంచలనమైన అట్లీతో సైతం సినిమా చేయడానికి తారక్ చర్చలు జరుపుతున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది.
ఇక తెలుగు దర్శకులతో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసారు. ఇలా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ డైరెక్టర్లు అందర్నీ తారక్ చుట్టేస్తున్నారు. బ్యాలెన్స్ మాలీవుడ్ ఒక్కటే ఉంది. తారక్ ను స్టోరీతో మెప్పించగల్గితే వాళ్లకు అవకాశం లేకపోలేదు. అవార్డు డైరెక్టర్లు అంతా అక్కడే ఉన్నారు వాళ్ల కథల్ని కాస్త కమర్శియల్ పార్మెట్ లోకి మార్చ గల్గితే పాన్ ఇండియాలో అవి సంచలనాలే నమోదు చేస్తాయి. తారక్ లాంటి వాళ్లు అలాంటి వారికి అవకాశాలివ్వడానికి ఎప్పుడూ ముందుంటారు.