ఎన్టీఆర్-నీల్.. బ్యాక్ డ్రాప్, బడ్జెట్ లీక్స్!

అయితే ఈ కాంబినేషన్ కు సంబంధించిన బడ్జెట్, బ్యాక్ డ్రాప్ లీక్స్ మరీంత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

Update: 2025-02-21 11:30 GMT

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై సిని లవర్స్ లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన నీల్, ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలసి మరింత హై లెవెల్‌లో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. మాస్, యాక్షన్ ఎలివేషన్లకు పెట్టింది పేరైన ఈ కాంబో, ప్రేక్షకులను థియేటర్లలో కుదిపేయడం గ్యారెంటీ. అయితే ఈ కాంబినేషన్ కు సంబంధించిన బడ్జెట్, బ్యాక్ డ్రాప్ లీక్స్ మరీంత ఆసక్తిని కలిగిస్తున్నాయి.

దేవర సినిమాతో ఎన్టీఆర్ ఇప్పటికే ఒక బిగ్ హిట్‌ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌కు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్‌లో తన సత్తా చాటనున్న తారక్, అటు నుంచి నేరుగా నీల్ సినిమా సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన బిజీ షెడ్యూల్ మరింత వేగం పుంజుకుంటుందని టాక్.

ఇక సినిమాకు సంబంధించి లేటెస్ట్ లీక్ ఏమిటంటే… ఈ సినిమా గోల్డెన్ ట్రయాంగిల్ అనే ప్ర‌మాద‌క‌ర‌మైన మాఫియా ప్రాంతం నేపథ్యం చుట్టూ తిరుగుతుందని టాక్. ఈశాన్య మయన్మార్, వాయువ్య థాయ్‌లాండ్, ఉత్తర లావోస్‌లను కలుపుతూ ఏర్పడిన ఈ గోల్డెన్ ట్రయాంగిల్, 1950 ప్రాంతంలో నల్లమందు తయారీకి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. హెరాయిన్, ఓపియం లాంటి డ్రగ్స్ ఇక్కడే పండించి, ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసే హబ్‌గా మారింది. ఆ దందా వెనుక ఉన్న గ్యాంగ్‌ల మధ్య ఎదిగిన ఓ నాయకుడిగా తారక్ పాత్రను డిజైన్ చేశారట.

మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ ప్రకారం, ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఒక సామాన్యుడిగా మొదలై, మాఫియా సామ్రాజ్యాలను సమూలంగా నిర్వీర్యం చేసే పవర్‌ఫుల్ లీడర్‌గా ఎదిగేలా డిజైన్ చేశారని తెలుస్తోంది. అతని క్యారెక్టర్‌లో బ్లడ్ షేడ్, ఎమోషన్, రివేంజ్, లీడర్‌షిప్ అనే అంశాలు ఉండబోతున్నాయట. నిన్న రిలీజ్ చేసిన సెట్స్ ఫోటోల్లో పాత అంబాసిడర్ కార్లు, సైకిళ్లు కనిపించడం కూడా 1970ల నాటి గోల్డెన్ ట్రయాంగిల్ నేపథ్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి.

ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించారు. ప్రాజెక్ట్ మొత్తం 360 కోట్ల రూపాయలతో తెరకెక్కుతోంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమా. యాక్షన్ ఎపిసోడ్స్, సెట్స్, విఎఫ్ఎక్స్‌ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారు. టాప్ టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ చిత్రం, హాలీవుడ్ లెవెల్‌లో విజువల్స్ అందించబోతుందట.

మొత్తానికి, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడం ఖాయం. కేవలం తెలుగులోనే కాదు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం, అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఈ సినిమా పక్కా హిట్ కొడుతుందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ స్టైల్, ఎన్టీఆర్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్ కలగలిసిన ఈ మూవీ వెయ్యి కోట్లు వసూలు చేసే సినిమా అవుతుందని చెప్పవచ్చు.

Tags:    

Similar News