'దేవర' పోస్టర్ పై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్!
మా 'దేవర' మాపాలిట దేవుడు అంటూ మరోవైపు అభిమానులు నినాదాలతో మోతెక్కిస్తున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `దేవర` మరికొన్ని గంటల్లో రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. మిడ్ నైట్ నుంచే స్పెషల్ షోలు పడుతున్నాయి. `ఆర్ ఆర్ ఆర్` తర్వాత తారక్ నుంచి రిలీజ్ అవుతోన్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సినిమా ఎలా ఉంటుంది? అన్న ఎగ్జైట్ మెంట్ అందరిలో అంత కంతకు పెరిగిపోతుంది. మా `దేవర` మాపాలిట దేవుడు అంటూ మరోవైపు అభిమానులు నినాదాలతో మోతెక్కిస్తున్నారు.
సరిగ్గా ఇదే సమయంలో `దేవర` పోస్టర్ పై `సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్` అంటూ మరో పోస్టర్ అంటించడం ఆసక్తికరంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం జన జాగరణ సమితి పిలుపునిచ్చింది. తమకు మద్దతుగా ఎన్టీఆర్ నిలవాలని...వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన బాధ్యత ఎన్టీఆర్ తీసుకోవాలని మద్దతు కోరుతున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం తారక్ తమ ఉద్యమంలో భాగం కావాలని కోరారు.
సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటూ రాసి వాటిపై ఎన్టీఆర్ పోస్టర్లు వేసారు. విశాఖ అంతటా ఇప్పుడా పోస్టర్లు వెలిసాయి. అడుగడుగునా దేవర పోస్టర్ల పై సేవ్ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఉద్యోగులం దర్నీ ఎన్టీఆర్ కాపాడలని...విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు అంటూ నినాదాలతో మోతెక్కిస్తున్నారు. ఇంతకు ముందు అలాంటి పోస్టర్లు పవన్ కళ్యాణ్ బొమ్మలతో వెలిసేవి.
అయితే ఇప్పుడు పవన్ బొమ్మలు ఎక్కడా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ తీరుపై స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మండిపడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రయివేటు పరం చేస్తుంటే చూస్తూ ఊరుకుం టున్నారని, ఆయనకు ప్రజల కంటే సనాతన ధర్మం పేరిట అనవసరమైన యాగీ చేస్తున్నారని మండిపడుతున్నారు.